Donald Trump | ప్రత్యర్థి వివేక్ రామస్వామిపై ట్రంప్ పొగడ్తలు!

అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో పాటు పలువురు పోటీలో ఉన్నారు. వీరిపై సీబీఎస్ యూగౌ (CBS YouGov) ఓ పోల్‌ సర్వే నిర్వహించింది. ఇందులో అధ్యక్ష అభ్యర్థి రేసులో అందరికంటే ట్రంప్‌ ముందంజలో ఉండగా.. ఫ్లోరిడా గవర్నర్‌ డిశాంటిస్‌ రెండో స్థానంలో నిలిచారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో సమానంగా వివేక్‌ రామస్వామి మూడో స్థానంలో నిలిచారు.

Update: 2023-05-08 18:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో పాటు పలువురు పోటీలో ఉన్నారు. వీరిపై సీబీఎస్ యూగౌ (CBS YouGov) ఓ పోల్‌ సర్వే నిర్వహించింది. ఇందులో అధ్యక్ష అభ్యర్థి రేసులో అందరికంటే ట్రంప్‌ ముందంజలో ఉండగా.. ఫ్లోరిడా గవర్నర్‌ డిశాంటిస్‌ రెండో స్థానంలో నిలిచారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌తో సమానంగా వివేక్‌ రామస్వామి మూడో స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి పేరు ఈ సర్వేలో ముందు వరుసలో రావడం పట్ల ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. దీని గురించి ఆయన సోషల్ మీడియాలో ప్రస్తావించారు.

ఒక అధ్యక్ష అభ్యర్థి అయినే ట్రంప్.. ఎన్నికల్లో తనకు ప్రత్యర్థి అయిన వివేక్‌ను ప్రశంసలతో ముంచెత్తడం అమెరికాలో చర్ఛనీయంశంగా మారింది. "ఇటీవలి రిపబ్లికన్ ప్రైమరీ పోల్, CBS YouGovలో వివేక్ రామస్వామి బాగా రాణిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను" అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో రాశారు.

"అతను మైక్ పెన్స్‌తో సమానంగా ఉన్నాడు. త్వరలోనే డిశాంటిస్ ను దాటేలా ఉన్నాడు. వివేక్‌లో నాకు నచ్చిన విషయం ఏమిటంటే.. అతను నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మంచి విషయాలు మాత్రమే మాట్లాడారు" అని ట్రంప్ రాసుకొచ్చారు.

హెల్త్‌కేర్, టెక్ రంగ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి 2024 US అధ్యక్ష ఎన్నికల్లో తను పోటి పడుతున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించారు.

వివేక్ రామస్వామి ఎవరంటే..

వివేక్ రామస్వామి అమెరికాలోని ఒహాయోలో 1985 ఆగస్టు 9న జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు ఆమెరికాకు వలస వచ్చారు. వివేక్ తల్లి వృద్ధాప్య మానసిక వైద్యురాలు కాగా.. తండ్రి జనరల్ ఎలక్ట్రిక్‌లో ఇంజనీర్‌గా పనిచేశారు. వివేక్ రామస్వామి హార్వర్డ్‌, యేల్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. గత ఏడాది ఆయన స్ట్రైవ్ అసెట్ మేనేజ్‌మెంట్‌ సంస్థను స్థాపించారు. ఆయన ఔషధరంగంలో పని చేశారు. 2016లో ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ 600 మిలియన్‌ డాలర్లుగా ఉంది.


ఇవి కూడా చదవండి:

GPS లొకేషన్ గుడ్డిగా ఫాలో అయ్యారు.. చివరికి వాళ్లకు ఏ గతి పట్టిందంటే..  

Tags:    

Similar News