ట్రంప్‌కు ప్రపంచంలోనే సంపన్నుడు ఎలాన్ మస్క్ విరాళం.. ఎంత ?

దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయం రంగు ఏ దేశంలోనైనా ఒక్కటే !! ఎన్నికలు వస్తున్నాయంటే.. రాజకీయ పార్టీలు వెతికేది ప్రజా సమస్యల కోసం కాదు.. విరాళాల కోసం!!

Update: 2024-03-06 11:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయం రంగు ఏ దేశంలోనైనా ఒక్కటే !! ఎన్నికలు వస్తున్నాయంటే.. రాజకీయ పార్టీలు వెతికేది ప్రజా సమస్యల కోసం కాదు.. విరాళాల కోసం!! ఇందుకోసం అవి బడా వ్యాపార సంస్థల అధినేతలతో మంతనాలు జరుపుతుంటాయి. ఇప్పటిదాకా తాము అందించిన తాయిళాలు.. ఇకపై గెలిస్తే కురిపించే వరాల వివరాలతో ప్రజెంటేషన్ ఇస్తుంటాయి. ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దాదాపు ఖరారైంది. ఆ పార్టీలో ట్రంప్ ఏకైక ప్రత్యర్ధిగా నిలిచిన భారత సంతతి వనిత నిక్కీ హేలీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేకపోయారు. దీంతో మరోసారి రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ట్రంప్‌కు లైన్ క్లియర్ అయింది. అమెరికాలో జరిగే ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. అక్కడ కూడా ఎన్నికల వేళ వేలకోట్లు ఖర్చవుతుంటాయి. అందుకే డొనాల్డ్ ట్రంప్ విరాళాల సేకరణపై ఫోకస్ పెట్టారు.

ట్రంప్ గంపెడాశలు..

ఈక్రమంలోనే తాజాగా ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్‌తో ఫ్లోరిడా నగరంలో భేటీ అయ్యారు. రూ.16 లక్షల కోట్లకుపైగా సంపద కలిగిన కుబేరుడు ఎలాన్ మస్క్ ఎంత చందాను ఇస్తానని మాట ఇచ్చారో తెలియరాలేదు. ఫ్లోరిడా నగరంలోని ఇంకొంత మంది సంపన్నులను కూడా ట్రంప్ కలిసి విరాళాల గురించి చర్చించారట. డొనాల్డ్ ట్రంప్‌కు కూడా రూ.21వేల కోట్ల సంపద ఉంది. ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో ట్రంప్‌పై అమెరికాలోని పలు కోర్టులు వేల కోట్ల జరిమానాలు, నష్టపరిహారాలు విధించాయి. ప్రతిపక్షంలో ఉండటంతో ఆయనకు చెందిన చాలా వ్యాపారాలు నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. ఈనేపథ్యంలో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న ట్రంప్.. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ల సహకారంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారంటూ అమెరికా మీడియా దిగ్గజం ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది.

Tags:    

Similar News