Donald Trump:టేలర్‌ స్విఫ్ట్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు..పాప్‌స్టార్‌కు ట్రంప్‌ వార్నింగ్

అమెరికా(USA)లో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్(Democratic) పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌(Kamala Harris)కు తాను మద్దతిస్తున్నట్లు అమెరికన్‌ పాప్‌స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌(Taylor Swift) ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-11 19:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(USA)లో నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్(Democratic) పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌(Kamala Harris)కు తాను మద్దతిస్తున్నట్లు అమెరికన్‌ పాప్‌స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌(Taylor Swift) ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా మంగళవారం రాత్రి ఇద్దరు అధ్యక్షుల మధ్య జరిగిన డిబేట్ తర్వాత టేలర్ స్విఫ్ట్ వైస్ ప్రెసిడెంట్ కమలాకు బహిరంగంగా మద్దతు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.అయితే తాజాగా ఆమె కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వటంపై రిపబ్లికన్‌(Republican) పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) టేలర్‌పై మండిపడ్డారు

ఈ సందర్భంగా ట్రంప్‌ బుధవారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..'నేను టేలర్ స్విఫ్ట్ అభిమానిని కాదు. కేవలం సందర్భం వచ్చిందని చెబుతున్న. ఆమె ఎల్లప్పుడూ డెమోక్రట్లకే మద్దతు పలుకుతుందని,అందుకోసం ఆమె తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని' ట్రంప్ హెచ్చరించారు.స్విఫ్ట్ కంటే కాన్సాస్ సిటీ (Kansas City) చీఫ్స్ క్వార్టర్‌బ్యాక్ ప్యాట్రిక్ మహోమ్స్ (Patrick Mahomes) భార్య బ్రిటనీ మహోమ్స్‌(Brittany Mahomes)ను తాను ఇష్టపడతానని ట్రంప్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌, టిమ్ వాల్జ్‌(Tim Walz)కు ఓటు వేస్తానని టేలర్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. కమలా దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తారని,మన హక్కుల కోసం పోరాడటానికి ఒక వారియర్‌ అవసరమని భావిస్తున్నట్లు తన పోస్టులో అభిప్రాయం వ్యక్తం చేశారు. గొడవలు, గందరగోళం లేకుండా ప్రశాంతంగా పరిపాలన అందిస్తే.. దేశం కోసం ఏదైనా సాధించవచ్చని నమ్ముతున్నానని టేలర్ పేర్కొన్నారు.కమలా హారిస్ కు టేలర్ మద్దతు విషయంపై మీడియాలో ఎదురైనా ప్రశ్నకు ట్రంప్ పైవిధంగా స్పందించారు.


Similar News