బ్రిటన్ పార్లమెంట్ రద్దు..సార్వత్రిక ఎన్నికలు అప్పుడే?

బ్రిటన్‌లో జూలై 4వ తేదీన సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ మేరకు ఆ దేశ పార్లమెంటు రద్దైంది.

Update: 2024-05-30 07:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్‌లో జూలై 4వ తేదీన సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ మేరకు ఆ దేశ పార్లమెంటు రద్దైంది. 650 పార్లమెంటు సభ్యుల సీట్లు ఖాళీ కావడంతో ఎలక్షన్ ప్రచారం గురువారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు వర్షంలో తడుస్తూనే ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు రద్దైంది. బ్రిటన్‌లో గత 14 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. ఈ క్రమంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత సంతతికి చెందిన రిషి సునాక్ రెండేళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ కంటే లేబర్ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 129 మంది ఎంపీలు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. 


Similar News