Delta Airlines: క్రౌడ్ స్ట్రైక్‌ అంతరాయం.. 500 మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేసిన డెల్టా ఎయిర్‌లైన్స్

గత జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో మైక్రోసాఫ్ట్(Microsoft) సర్వర్‌లలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-03 22:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో మైక్రోసాఫ్ట్(Microsoft) సర్వర్‌లలో అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. విండోస్‌లో సాంకేతిక సమస్యల కారణంగా భారత్, అమెరికాతో సహా అనేక దేశాలలో విమానాలు రద్దు చేయబడ్డాయి. బోర్డింగ్ పాస్‌లు కూడా చేతితో రాయాల్సి వచ్చింది. తప్పుడు అప్‌డేట్‌తో చాలా కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఈ కారణంగా, సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్‌(Crowd Strike) నష్టపరిహారం కోరుతూ అనేక విమానయాన సంస్థలు అలాగే వ్యాపార సంస్థలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ అమెరికన్ ఎయిర్‌లైన్స్ కంపెనీ డెల్టా(Delta) కూడా క్రౌడ్ స్ట్రైక్‌ 500 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది.క్రౌడ్ స్ట్రైక్ నిర్లక్ష్యం, ఉద్దేశ పూర్వక దుష్ప్రవర్తన కారణంగానే తమ సంస్థ నష్టపోయిందని తెలిపింది. ఈ కేసును వాదించడానికి డెల్టా ప్రముఖ న్యాయవాది డేవిడ్ బోయిస్ ను తమ న్యాయవాదిగా నియమించుకుంది.

అలాగే జూలై 29 వరకు కంపెనీలో షేర్లను కలిగి ఉన్న వాటాదారులు కూడా క్రౌడ్‌స్ట్రైక్‌పై క్లాస్ యాక్షన్ దావా వేసి చట్టపరమైన చర్య తీసుకున్నారు. క్రౌడ్‌స్ట్రైక్ యొక్క పారదర్శకత అలాగే రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతుల గురించి వాటాదారులు ప్రశ్నలను లేవనెత్తుతూ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విధానాలకు సంబంధించి కంపెనీ తమను తప్పుదారి పట్టించిందని వారు పేర్కొన్నారు.దీంతో క్రౌడ్‌స్ట్రైక్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటోంది. 


Similar News