LIVE earthquake updates :తుర్కియే, సిరియాల్లో పెరుగుతున్న మరణాలు
యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా తుర్కియే, సిరియాల్లో సంభవించిన వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరు దేశాల్లో
దిశ, డైనమిక్ బ్యూరో : యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసేలా తుర్కియే, సిరియాల్లో సంభవించిన వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇరు దేశాల్లో ఇప్పటి వరకు 4,365కు పైగా మృతుల సంఖ్య చేరిందని జాతీయ మీడియా సంస్థల వెల్లడించాయి. భారీ భూకంపాల ధాటికి టర్కీ, సిరియా అతలాకుతలమయ్యాయి. పెను విపత్తు సంభవించడంతో పేక మేడల్లా ఉండే 5,600 కంటే ఎక్కువ భవనాలు కూలిపోయాయి. భారీ భవనాల కింద ఉన్న మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీస్తున్నారు. నిన్న ఒక్కరోజే తుర్కియే, సిరియా దేశాల్లో సంభవించిన భూకంపం ఘటనల్లో 4 వేల మందికిపైనే ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితులు ఎంత హృదయవిదారకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం 2,921 మంది మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తోంది. భూకంపం ధాటికి ఊరు, పట్టణాలనే తేడా లేకుండా మరు భూములుగా మారిపోయాయి. టర్కీ, సిరియాలో భూకంపం ప్రకోపానికి భారీగా ప్రాణ, -ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారుల అంచనా ప్రకారం 20,000 మంది వరకు మరణించి ఉండవచ్చని అంటున్నారు.