Crocodile Attack : ఈత కొట్టడం కోసం నదిలోకి వెళ్లిన మహిళ.. దాడి చేసి చంపేసిన మొసలి

ఇండోనేషియా దేశంలో మొసళ్ల దాడులు తరుచుగా జరుగుతున్నాయి.

Update: 2024-08-21 23:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియా దేశంలో మొసళ్ల దాడులు తరుచుగా జరుగుతున్నాయి. వాటి బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తూర్పు ఇండోనేషియాలోని నదిలో స్నానం చేస్తున్న ఓ మహిళను మొసలి చంపివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మలుకు దీవుల్లోని వాలి గ్రామనికి చెందిన 54 ఏళ్ల హలీమా రహక్‌బౌవ్ (Halima Rahakbauw) అనే మహిళ మంగళవారం ఉదయం సరదా కోసం నదిలో ఈత కొట్టడానికి వెళ్ళింది .ఈత కొడుతుండగా మొసలి హఠాత్తుగా ఆమెపై దాడి చేసి క్రూరంగా కొరికి చంపేసింది. ఎంతసేపటికి ఇంటికి తిరిగిరాకపోవడంతో బంధువులు, స్నేహితులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు ఓ నదిలో ఆమె యొక్క చెప్పులు , శరీర భాగాన్ని గుర్తించారు.దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ఆ మొసలిని చంపి దాని కడుపులోంచి ఆమె శరీర భాగాలను బయటకు తీశారు.ఇటీవల ఇండోనేషియాలో మొసళ్ల దాడులు పెరిగిపోయాయి. గత ఆదివారం సుమత్రాలోని బంగ్కా ద్వీపంలోని నది సమీపంలో 63 ఏళ్ల టిన్ మైనర్ అనే వ్యక్తి కూడా మొసలి చేతిలో చనిపోయాడు.గతంలో ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలోని పాపువాలో ఒక స్థానిక వ్యక్తిని మొసలి చంపినందుకు ప్రతీకారంగా అక్కడి ప్రజలు దాదాపు 300 మొసళ్లను చంపేశారు. కాగా ఇండోనేషియా దేశం అనేక రకాల మొసళ్లకు నిలయంగా ఉంది.అక్కడి మొసల్లు క్రమం తప్పకుండా మనుషులపై దాడి చేసి చంపుతాయి.


Similar News