కుప్పకూలిన ప్యాసింజర్ విమానం: ఇండియాదేనని అనుమానం!
ఈశాన్య ఆప్ఘనిస్థాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం క్రాష్ అయినట్టు ప్రావిన్షియల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ జబిహుల్లా అమిరి తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య ఆప్ఘనిస్థాన్‌లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది. చైనా, తజికిస్థాన్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బదక్షన్ ప్రావిన్స్‌లో విమానం క్రాష్ అయినట్టు ప్రావిన్షియల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ హెడ్ జబిహుల్లా అమిరి తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంపై స్పష్టమైన సమాచారం లేదని వెల్లడించారు. శక్తివంతమైన హిందూ కుష్ పర్వత శ్రేణి ప్రావిన్స్ గుండా విమానం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే,విమానం ఏ సంస్థకు చెందినది? అది ఎక్కడి వెళ్తుంది? అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఆ విమానం భారత్‌కు చెందినదని.. బదక్షన్‌లోని జెబాక్ జిల్లాలోని ఎత్తైన పర్వతాలపై కూలిపోట్టునట్టు పలు కథనాలు వెలువడ్డాయి.