China :వామ్మో.. చైనాలో మరో ప్రాణాంత‌క వైరస్..మెదడుపైనే ఎఫెక్ట్‌.. !

చైనా(China) ఈ పేరు వింటేనే ముందుగా గుర్తుకొచ్చేది కరోనా వైరస్‌(Corona virus).

Update: 2024-09-08 20:20 GMT

దిశ, వెబ్‌డెస్క్:చైనా(China) ఈ పేరు వింటేనే ముందుగా గుర్తుకొచ్చేది కరోనా వైరస్‌(Corona virus). ఈ వైరస్‌ సుమారు రెండు సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడించిన విషయం తెలిసిందే. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌కు జన్మనిచ్చిన చైనాలో మరో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది.వెట్‌ల్యాండ్ (wetland virus) 'WELV' అని పిలవబడే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.వెట్‌ల్యాండ్‌ (WELV) వైరస్‌ అనేది క్రిమియన్‌ కాంగో హెమరేజిక్‌(Crimean-Congo hemorrhagic) ఫీవర్‌ గ్రూప్‌నకు చెందిన వైరస్‌. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకుఈ వైరస్ కారణమవుతుందని సైంటిస్ట్ లు గుర్తించారు.ఇది కీటకాల కాటు ద్వారా మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ వెట్‌ల్యాండ్ వైరస్‌ను తొలుత 2019లో గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని జిన్ జఔ (Jinzhou) నగరంలో ఉండే 61 ఏళ్ల వృద్ధుడు అప్పట్లో అనారోగ్యానికి గురయ్యాడు. మంగోలియా(Mongolia) లోని చిత్తడి నెలకు చెందిన ఇతడు పేలు కాటుకి గురైన 5 రోజులకు అనారోగ్యానికి గురయ్యాడు.బాధితుడు ఐదు రోజుల పాటు జ్వరం, తల నొప్పి తో బాధ పడ్డాడు.వెంటనే అప్రమత్తమైన పరిశోధకులు మంగోలియా ప్రాంతంలోని 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషించారు. అందులో 12 మందిలో ఈ రకమైన వైరస్‌ ఉన్నట్లు తేలింది. జ్వరం, మైకం, తలనొప్పి, వికారం, విరేచనాలు వంటి లక్షణాలను వారిలో గుర్తించారు. వీరిలో మెదడు, వెన్నెముక ద్రవంలో అధిక తెల్ల రక్త కణాల సంఖ్య కారణంగా ఒక రోగి కోమాలోకి వెళ్లాడు. అయితే చికిత్స తర్వాత వీరంతా కోలుకున్నారు.  అయినప్పటికీ ఎలుకలపై ల్యాబ్‌ల్లో చేసిన ప్రయోగాల్లో WELV ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందని,ఈ వైరస్ ముఖ్యంగా మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేయగలదని పరిశోధనలో తేలింది. తాజాగా ఈ అధ్యయానికి సంబంధించిన నివేదిక ది న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌(New England Journal Of Medicine)లో ప్రచురితమైంది.అయితే కొన్ని పందులు, గొర్రెలు, గుర్రాల్లోనూ WELV ఆర్‌ఎన్‌ఏ (RNA) ఉన్నట్లు సైంటిస్టులు ఇది వరకే గుర్తించారు.


Similar News