బలవంతంగానైనా తైవాన్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోడానికి చైనా సిద్ధం: రక్షణ మంత్రి

తైవాన్ స్వాతంత్య్రాన్ని బలవంతంగా ఆపడానికి చైనా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి డాంగ్ జున్ ఆదివారం హెచ్చరించారు

Update: 2024-06-02 08:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్ స్వాతంత్య్రాన్ని బలవంతంగా ఆపడానికి చైనా సిద్ధంగా ఉందని ఆ దేశ రక్షణ మంత్రి డాంగ్ జున్ ఆదివారం హెచ్చరించారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మాతృభూమి ఏకీకరణను రక్షించడంలో ముందు ఉంటుంది. తైవాన్‌ చైనాలో ఒక భాగామే, దానిని నాశనం చేయలేరు. తైవాన్ స్వాతంత్య్రాన్ని బలవంతంగా అరికట్టడానికి, అన్ని సమయాల్లో కృతనిశ్చయంతో, శక్తివంతంగా పనిచేస్తున్నామని డాంగ్ ఆదివారం ఫోరమ్‌లో చెప్పారు.

చైనా నుండి తైవాన్‌ను వేరు చేయడానికి ప్రయత్నించే వారు ముక్కలు ముక్కలుగా నలిగిపోతారు, అలా చేసే వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దక్షిణ చైనా సముద్రంపై, చైనాకు అన్ని హక్కులు ఉన్నాయి. పలు దేశాల నౌకలు ఇక్కడ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వీటిని అడ్డుకోడానికి బీజింగ్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. హక్కుల ఉల్లంఘనలు, రెచ్చగొట్టే సందర్భంలో చైనా తగినంత సంయమనాన్ని కలిగి ఉంది, అయితే దీనికి పరిమితులు ఉన్నాయని డాంగ్ చెప్పారు.

అమెరికాతో సంబంధాల గురించిన మాట్లాడిన ఆయన చైనా-అమెరికా మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటి పరస్పరం చర్చించుకోడాని సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశం తర్వాత, అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ మాట్లాడుతూ, యుఎస్, చైనా మిలిటరీ కమాండర్ల మధ్య టెలిఫోన్ సంభాషణలు రాబోయే నెలల్లో తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. డాంగ్, ఆస్టిన్ సింగపూర్‌లో ఫోరమ్‌ను నిర్వహిస్తున్న విలాసవంతమైన హోటల్‌లో ఒక గంటకు పైగా సమావేశమయ్యారు, దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ అధికారులు హాజరయ్యారు.


Similar News