Nikki Haley: 'చైనా వార్‌కు రెడీ అవుతోంది'.. నిక్కీ హేలీ సంచలన కామెంట్స్

చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ అన్నారు.

Update: 2023-09-23 12:23 GMT

వాషింగ్టన్‌: చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ అన్నారు. అమెరికాతో పాటు యావత్‌ ప్రపంచానికి చైనా పెద్ద ముప్పుగా మారిందని పేర్కొన్నారు. అమెరికాలోని న్యూహ్యాంప్‌ షైర్‌లో ఆర్థికవ్యవస్థ విధి, విధానాలపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె ఈ కామెంట్స్ చేశారు. ‘‘అమెరికాను ఓడించేందుకు 50 ఏళ్ల నుంచి చైనా పన్నాగాలు పన్నుతోంది. కొన్ని విషయాల్లో చైనా సైన్యం ఇప్పటికే అమెరికా ఆర్మీతో సమానంగా ఉంది. చైనాను ఎదుర్కొనేందుకు చాలా శక్తి అవసరం’’ అని నిక్కీ హేలీ తెలిపారు.

రాజకీయ నాయకులకే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా ఐదేళ్లే పదవీ కాలపరిమితి ఉండాలని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన 500 బిలియన్‌ డాలర్ల గ్రీన్‌ ఎనర్జీ సబ్సిడీలను కూడా తొలగిస్తానని వెల్లడించారు. అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్నును తగ్గిస్తానని నిక్కీ చెప్పారు.


Similar News