కొండెక్కిన చికెన్ ధరలు.. కోడి కాళ్లు తింటున్న ప్రజలు!
ఈజిప్ట్ దేశంలో ద్రవ్యోల్బణంతో నిత్య అవసరాల సరుకులకు విపరీతంగా ధరలు పెరిగాయి..
దిశ, వెబ్ డెస్క్:ఈజిప్ట్ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి నిత్య అవసరాల సరుకులకు విపరీతంగా ధరలు పెరిగాయి. ముఖ్యంగా చికెన్ ధర ఆకాశనంటుతోంది. ఏకంగా కేజీ చికెన్ రూ. 400 పైగా పెరగడంతో జనాలు చికెన్ తినాలంటేనే జంకుతున్నారు. చికెనే కాకుండా కోడి కాళ్లకు సైతం భారీగా ధర పెరిగాయి. ఈజిప్ట్‌లో కోడికోళ్లగా కిలో ఏకంగా రూ. 50 పలుకుతున్నాయి. దేశంలో అన్నింటి ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరింది. కోడి కాళ్లలో అధిక ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ప్రభుత్వం సూచించింది. అది తెలుసుకున్న ఈజిప్ట్ దేశ ప్రజలు ప్రభుత్వం ఇలాంటి సలహాల ఇవ్వడమేంటని మండిపడుతున్నారు.
Read more: