అమెరికాలో ఘనంగా చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలు..
చంద్రబాబు వల్లే మాకు అవకాశాలు వచ్చాయని సతీష్ వేమన అన్నారు.
దిశ, వాషింగ్టన్ డీసీ (అమెరికా) : చంద్రబాబు వల్లే మాకు అవకాశాలు వచ్చాయని సతీష్ వేమన అన్నారు. వాషింగ్టన్ డీసీలో చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేశారు.
సతీష్ వేమన మాట్లాడుతూ.. చంద్రబాబు సాంకేతిక విద్యను ప్రోత్సహించడం వల్ల లక్షలాది మంది ప్రవాసాంధ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. చంద్రబాబునాయుడు నేటి తరానికి మార్గదర్శి. సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం, ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా మలచుకోవడం ఆయన నైజమన్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాలను ఒంట పట్టించుకుని ఆయన చిన్న వయసులోనే మంత్రి, ముఖ్యమంత్రి పదవులు అధిరోహించి చరిత్ర సృష్టించారన్నారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ... వినూత్న ఆలోచనలతో దార్శనికత ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నిలిచిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుంది. సంస్కరణ ఫలాలు పేదవారికి అందించారు. ఐటీ, బీటీ రంగాలను ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో రాణిస్తున్నారంటే ఇందుకు చంద్రబాబునాయుడు గారు చూపిన చొరవే కారణమన్నారు. ఇటీవల శాసనమండలి ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు నాయకత్వం, ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయన్నారు.
భాను మాగులూరి మాట్లాడుతూ.. చంద్రబాబు తన విజన్ తో అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దేశంలోనే ఇంత అనుభవం ఉండి క్రియాశీలంగా ఉన్న నాయకులు మరొకరు లేరన్నారు. విధ్వంస పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలంటే చంద్రబాబునాయుడు తిరికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ప్రతిఒక్కరు కృషిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ వర్జీనియా అధ్యక్షులు సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, కిషోర్ కంచర్ల, కార్తీక కోమటి, రాము జక్కంపూడి, రవి అడుసుమిల్లి, మురళీ గోవింద రెడ్డి దొంతిరెడ్డి, మల్లి వేమన, సిద్ధు బోయపాటి, పవన్ పొట్లూరి, హరికృష్ణ తోకల, వినిల్ శ్రీరామినేని, సమంత్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.