ఆస్ట్రోనాట్స్ లేకుండానే.. భూమి మీదకు బోయింగ్ స్టార్ లైనర్!

అమెరికన్ ఆస్ట్రోనాట్స్(American astronauts) సునీతా విలియమ్స్(Sunita Williams), బ్యారీ ఇ విల్మోర్(Barry E.Wilmore) లను అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(International Space Station) తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్.. ప్రస్తుతం వారు లేకుండానే భూమ్మీదకు దిగింది.

Update: 2024-09-07 07:54 GMT

దిశ, వెబ్ డెస్క్: అమెరికన్ ఆస్ట్రోనాట్స్(American astronauts) సునీతా విలియమ్స్(Sunita Williams), బ్యారీ ఇ విల్మోర్(Barry E.Wilmore) లను అమెరికా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(International Space Station) తీసుకెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్.. ప్రస్తుతం వారు లేకుండానే భూమ్మీదకు దిగింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బోయింగ్ క్యాప్సూల్ పారాచూట్ సహాయంతో భూమ్మీద దిగింది. అయితే ఈ క్యాప్సూల్ ఉదయం 6 గంటలకు స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరి, మెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్ లోకి కిందకి పంపినట్లు స్టార్ లైనింగ్ కంపెనీకి చెందిన శాస్త్ర వేత్తలు వెల్లడించారు.

కాగా జూన్ 5, 2024 న కేవలం 10 రోజుల మిషన్ లో భాగంగా సునీతా, బ్యారీ లు రోదసీ యాత్ర చేపట్టారు. అయితే వీరిద్దరూ జూన్ 14 తేదీన భూమ్మీదకు రావాల్సి ఉండగా స్టార్ లైన్ వ్యోమనౌకలో హీలియం గ్యాస్ లీకేజి కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ల్యాండింగ్ ను వాయిదా వేశారు. ఆ తర్వాత మరోసారి జూన్ 26 వ తేదీన వీరిద్దరూ భూమ్మీదకు రానున్నట్లు నాసా(NASA) ప్రకటించగా అదికూడా వాయిదా పడింది. ఇలా పలుమార్లు వారి తిరుగు ప్రయాణాన్ని వాయిదా పడుతూ రాగా.. చివరికి బోయింగ్ స్టార్ లైనర్ సునీతా, బ్యారీ ఇద్దరూ లేకుండానే భూమిని చేరింది.


Similar News