ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ ఏటీఏసీఎంఎస్ మిస్సైళ్లను ఇవ్వనున్న అమెరికా

ఉక్రెయిన్‌కు అమెరికా అత్యాధునిక ఆయుధాలను ఇవ్వనుంది.

Update: 2023-09-23 11:49 GMT

కీవ్ : ఉక్రెయిన్‌కు అమెరికా అత్యాధునిక ఆయుధాలను ఇవ్వనుంది. సుమారు 300 కిలోమీట‌ర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఏటీఏసీఎంఎస్ క్షిప‌ణుల్ని అందించేందుకు అగ్ర రాజ్యం రెడీ అవుతోంది. ర‌ష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాలలోని టార్గెట్లను చేధించేందుకు ఈ మిస్సైళ్లు ఉపయోగ పడునున్నాయి. 150 కిలోమీట‌ర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సెవాస్తిపోల్‌పై స్టార్మ్ షాడో మిస్సైళ్లను బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాలు ఉక్రెయిన్ మిలిట‌రీకి ఇప్పటికే సమకూర్చాయి. ఏటీఏసీఎంఎస్ క్షిప‌ణులు కూడా వచ్చి చేరితే ఉక్రెయిన్ ఆర్మీ బలం మరింత పెరుగుతుంది.


Similar News