బంగ్లాదేశ్ నటి రోకేయా ప్రాచీపై నిరసనకారులు దాడి.. అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయిన నటి..!

బంగ్లాదేశ్ లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే

Update: 2024-08-16 21:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ అల్లరి మూక ప్రముఖ నటి రోకీయా ప్రాచీపై విచక్షణంగా దాడి చేశారు. ఆగస్టు 15న షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు నివాళులు అర్పించేందుకు రోకీయా ప్రాచీ బంగ్‌బంధు రోడ్‌కి వెళ్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. ఓ ప్రముఖ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రాచీ మాట్లాడుతూ.."నేను రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ గుంపు అకస్మాత్తుగా దాడి చేసిందని, నా చేతిలో ఉన్నపోస్టర్లను నిరసనకారులు చించివేసి, తనను చంపేస్తానని బెదిరించారని అన్నారు. అలాగే నన్ను కొట్టి బయటకు విసిరిన తర్వాత డ్యాన్స్ చేశారు. నా బట్టలు చింపేశారు, మహిళలను శారీరకంగా వేధించారు’’ అని ప్రాచీ గుర్తు చేసుకున్నారు.

అయితే .. రోకీయా ప్రాచీ , మాజీ ప్రధాని షేక్ హసీనాకు అలాగే అవామీ లీగ్ నాయకులకు మద్దతుగా నిలిచింది. షేక్ హసీనాకు మద్దత్తు తెలపడంతోనే జమాత్ ఇస్లామికి చెందిన కొంత మంది తనపై కక్ష్యగట్టి దాడి చేశారని, రేపు నేను సురక్షితంగా ఉండబోతున్నానో లేదో నాకు తెలియదని ప్రాచీ చెప్పారు. ప్రస్తుతం దేశాన్ని ఎవరు నడుపుతున్నారో నాకు తెలియదు, ఇప్పుడున్న ప్రభుత్వం మనుషుల యొక్క ప్రాణాలను చంపి మృతదేహాలను వేలాడదీస్తున్నారుని ప్రాచీ అన్నారు.అలాగే తన తలపై గన్ పెట్టి గురిపెట్టిన కూడా నేను నా దేశం కోసం రాజీపడనని , ఈ రోజు జరుగుతున్న దాడులు బంగ్లాదేశ్ మూలాలను దెబ్బతీసే ప్రయత్నమే" అని ఆమె అన్నారు.కాగా.. గతంలో ఈ దాడుల వల్ల అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రాణభయంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. తాజాగా ఈ దాడులు రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా ఇప్పుడు నటీనటుల వరకు చేరడం గమనార్హం.

Tags:    

Similar News