బంగ్లాదేశ్ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రాజీనామా

శనివారం బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి.

Update: 2024-08-10 11:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : శనివారం బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆ దేశ సుప్రీం చీఫ్ జస్టిస్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు నేడు మరోసారి నిరసనలు చేపట్టారు. గతవారం ప్రధాని తన పదవికి రాజీనామా చేయాలంటూ గొడవలు చేయగా, ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. కాగా ఈరోజు సుప్రీం కోర్టు జడ్జీలను లక్ష్యంగా చేసుకొని, వారంతా వెంటనే రాజీనామా చేయాలని సుప్రీం కోర్టు ప్రాంగణాన్ని చుట్టుముట్టారు. అయితే కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే చీఫ్ జస్టిస్ ఫుల్ కోర్టు సమావేశం ఏర్పరచడంతో నిరసనలు చెలరేగేయాని తెలుస్తోంది. నిరసనలు, అల్లర్లు అంతకంతకూ పెరగడంతో సుప్రీం చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హాసన్ తన పదవికి కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. సాయంత్రం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు ఒబైదుల్. అలాగే బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రౌఫ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. కాగా ఫాసిజంతో పెంచబడి, వివిధ అకృత్యాలకు పాల్పడిన సుప్రీంకోర్టు ప్రధాని రాజీనామా చేయాలంటూ.. విద్యార్థులు, న్యాయవాదులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన ప్రకటించారు.      


Similar News