PM Modi: అమెరికా పర్యటనలో పాలస్తీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి(Indian Prime Minister) నరేంద్ర మోదీ(Narendra Modi) మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా(USA) వెళ్లిన విషయం తెలిసిందే.

Update: 2024-09-24 00:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధానమంత్రి(Indian Prime Minister) నరేంద్ర మోదీ(Narendra Modi) మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా(USA) వెళ్లిన విషయం తెలిసిందే. క్వాడ్ సమ్మిట్(QUAD Summit) లో భాగంగా న్యూయార్క్‌(New York)లో పలు దేశాల అధినేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాల సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు(Palestinian President) మహమూద్ అబ్బాస్‌(Mahmoud Abbas)తో మోదీ సమావేశమయ్యారు. గాజా(Gaza)లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను కాపాడటానికి భారతదేశం యొక్క మద్దతును మోదీ పునరుద్ఘాటించారు.పాలస్తీనాను గుర్తించిన తొలి దేశాల్లో భారతదేశం ఒకటని మోదీ గుర్తుచేసుకున్నారు.ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా సభ్యత్వానికి భారత్ యొక్క నిరంతర మద్దతును తెలియజేశారు.భారత్-పాలస్తీనా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు తమ నిబద్ధతను ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు.కాగా అధ్యక్షుడు అబ్బాస్‌తో సమావేశానికి సంబంధించిన ఫోటోలను మోదీ తన 'ఎక్స్(X)' ఖాతాలో పంచుకున్నారు.


Similar News