Sheikh Hasina :షేక్ హసీనా నెక్ట్స్ స్టెప్ ఏమిటి ?.. భారత్‌తో బ్రిటన్ చర్చలు

దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం భారత్‌లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఏం చేయబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Update: 2024-08-08 14:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రస్తుతం భారత్‌లో ఉన్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఏం చేయబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై గురువారం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో, బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ ఫోన్‌లో చర్చలు జరిపారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా జైశంకర్ ప్రకటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులతో ముడిపడిన అంశాలు కూడా ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చాయని వెల్లడించారు.

షేక్ హసీనా భవిష్యత్తు ప్రణాళికలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. ‘‘భవిష్యత్తులో ఏం చేయాలనేది, ఏ నిర్ణయం తీసుకోవాలనేది హసీనా ఇష్టం. ఆవిషయంపై మాకు ఎలాంటి సమాచారమూ లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘ఆమెకు సంబంధించిన ప్రణాళికల గురించి మేం మాట్లాడటం సరికాదు’’ అని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్‌ రాజకీయాల నుంచి షేక్ హసీనా ఇక వైదొలగినట్టే అని ఇటీవలే ప్రకటించిన ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ మాట మార్చారు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తర్వాత హసీనా తప్పకుండా తిరిగివెళ్తారని తాజాగా గురువారం ప్రముఖ భారతీయ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బంగ్లాదేశ్‌లో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను చూసి, వారి కోసం మనసు మార్చుకున్నామని సజీబ్ తెలిపారు.

Tags:    

Similar News