Azerbaijan : మమ్మల్ని బ్రిక్స్ (BRICS) గ్రూపులో చేర్చుకోండి.. చైనాకు అజర్‌బైజాన్ విజ్ఞప్తి..!

బ్రిక్స్ (BRICS) గ్రూపులో చేరేందుకు అజర్‌బైజాన్ అధికారికంగా దరఖాస్తు చేసుకున్నట్లు అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

Update: 2024-08-21 18:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్రిక్స్ (BRICS) గ్రూపులో చేరేందుకు అజర్‌బైజాన్ అధికారికంగా దరఖాస్తు చేసుకున్నట్లు అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై ప్రారంభంలో అస్తానాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌లో పాల్గొన్న అజర్‌బైజాన్ తాము బ్రిక్స్ గ్రూప్ లో చేరడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపిందని, సమ్మిట్ సందర్భంగా.. అజర్‌బైజాన్, తమను బ్రిక్స్ (BRICS) గ్రూపులో చేర్చుకోవాలని చైనాకు విజ్ఞప్తి చేసిందని తెలిపింది. కాగా చైనా అజర్‌బైజాన్ యొక్క విజ్ఞప్తి ఆమోదించిందని, అజర్‌బైజాన్ ను బ్రిక్స్ (BRICS) లో చేర్చుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని చైనా ప్రతిజ్ఞ చేసిందని సమాచారం. అయితే బ్రిక్స్‌లో ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అలాగే దక్షిణాఫ్రికా దేశాలు ఉన్నాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా BRICS కూటమిలో భాగ్యస్వాములుగా ఉన్నాయి.  

Tags:    

Similar News