మహిళలపై పెరుగుతో దాడి.. అసలు ఏం జరిగిందంటే?

ఇద్దరు మహిళలు హిజాబ్ ధరించకుండా బయటికి వచ్చారని ఓ వ్యక్తి వారిపై పెరుగుతో దాడి చేసిన ఘటన ఇరాక్‌లోని మషాద్ నగరంలో చోటు చేసుకుంది.

Update: 2023-04-03 09:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు మహిళలు హిజాబ్ ధరించకుండా బయటికి వచ్చారని ఓ వ్యక్తి వారిపై పెరుగుతో దాడి చేసిన ఘటన ఇరాక్‌లోని మషాద్ నగరంలో చోటు చేసుకుంది. గతకొన్ని నెలలుగా ప్రపంచమంతటా హిజాబ్ వ్యతిరేక నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ పార్లమెంట్ అక్కడ మహిళల డ్రెస్ కోడ్‌కి సంబంధించి కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 7 ఏళ్ల వయస్సున్న బాలికతో సహా మహిళలంతా బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి. ఒకవేళ ఈ రూల్స్ పాటించకపోతే రూ.49 లక్షలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

అయితే తాజాగా.. మషాద్ పట్టణంలో తల్లి కుమార్తెలు ఇద్దరూ హిజాబ్ లేకుండా ఓ కిరాణం షాపు వద్దకు వెళ్లారు. వీరిద్దరి హిజాబ్ లేకుండా చూసిన ఓ వ్యక్తి వారితో గొడవపడి, వారిని తిట్టడమే గాక తీవ్ర కోపానికి గురైన అతను.. అదే షాపులో కొనుగోలు చేసిన పెరుగుతో వారిపై దాడి చేశాడు. ఆగ్రహంతో వారి నెత్తి మీదకు పెరుగును విసిరాడు. అక్కడే ఉన్న ఆ షాప్ ఓనర్ ఆ వ్యక్తినిపై దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి.. హిజాబ్ ధరించకుండా బయటకు ఎలా వస్తారు అంటూ.. ఆ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసి, వారిద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే.. పెరుగుతో దాడి చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశంలో హిజాబ్‌ను తొలగించడం ద్వారా మహిళలు చట్టాన్ని ఉల్లంఘించిన నేరానికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొంది.

దీంతో ఇద్దరి మహిళలపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. దాడి చేసిన వ్యక్తిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్లు ఇరాన్ జ్యుడిషియరీ మిజాన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ నివేదించింది. కించపరిచే పనికి పాల్పడ్డారని ఆరోపించారు. హిజాబ్‌ ధరించని మహిళలను షాపులోకి అనుమతించడంతోపాటు ఆ చట్టాన్ని పాటించనందుకు షాపు ఓనర్‌కి కూడా నోటీసులిచ్చారు. హిజాబ్ ధరించడంపై కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించే మహిళలను ప్రాసిక్యూట్ చేస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ బెదిరించిన సమయంలోనే ఇలా జరగడం గమనార్హం. ఇలాంటి నీచమైన పనులు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని, వానిసై ఏ మాత్రం జాలి చూపమని ఏజేఈ మొహసేని హెచ్చరించారు.  ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read..

ఏకంగా 550 మందికి తండ్రి అయిన డాక్టర్.. ఎలా అంటే? 


Tags:    

Similar News