మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : కల్పనాచావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత సంతతి మహిళ సునీతా విలియమ్స్ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో : కల్పనాచావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత సంతతి మహిళ సునీతా విలియమ్స్ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టేందుకు ఆమె రెడీ అవుతున్నారు. మే 6న రాత్రి 10.34 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ వద్దనున్న స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 నుంచి బోయింగ్ సంస్థకు చెందిన ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్, వ్యోమగామి బుచ్ విల్మోర్ అంతరిక్ష యాత్రకు బయలు దేరనున్నారు. వీరిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి చేరుకొని ఒక వారం పాటు అక్కడే గడపనున్నారు. స్టార్‌లైనర్ వ్యోమనౌకలో నిర్వహిస్తున్న మొదటి మానవ సహిత మిషన్ ఇదే కావడం గమనార్హం. దీని సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించే లక్ష్యంతో దీనిలో ప్రయోగం నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం రోజు (ఏప్రిల్ 25న) నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్‌లో ఇద్దరు వ్యోమగాములతో ప్రెస్‌మీట్‌ను నిర్వహించనున్నారు. కాగా, సునీతా విలియమ్స్ తొలిసారి 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ మధ్యకాలంలో అంతరిక్ష యాత్రకు వెళ్లింది. అప్పట్లో ఆమె 29 గంటల 17 నిమిషాల పాటు నాలుగుసార్లు స్పేస్‌వాక్ చేశారు. 2012లో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీత రీసెర్ఛ్ చేశారు.