China : లడఖ్ ఎప్పటికీ మాదే

Update: 2023-12-15 12:05 GMT
China : లడఖ్ ఎప్పటికీ మాదే
  • whatsapp icon

బీజింగ్‌: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమే అని భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా స్పందించింది. లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని తాము గుర్తించడంలేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ వెల్లడించారు. లడఖ్‌ను భారత్‌ ఏకపక్షంగా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిందని ఆరోపించారు. ఆర్టికల్‌ 370పై భారత సుప్రీంకోర్టు తీర్పు చైనా-భారత్‌ సరిహద్దుకు సంబంధించిన వాస్తవ స్థితిని మార్చదని స్పష్టం చేశారు. లడఖ్‌ ఎప్పటికీ తమ భూభాగమేనని మావో నింగ్‌ తేల్చి చెప్పారు.

Tags:    

Similar News