మొదటి నెలలోనే 3.50 లక్షల మంది.. ఆ ఆలయానికి పోటెత్తిన భక్తులు

దిశ, నేషనల్ బ్యూరో : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని అబుధాబిలో అద్భుతంగా నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయానికి భక్తజనం పోటెత్తుతున్నారు.

Update: 2024-04-03 12:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశంలోని అబుధాబిలో అద్భుతంగా నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయానికి భక్తజనం పోటెత్తుతున్నారు. స్వామినారాయణ్ సంస్థ రూ.700 కోట్లతో నిర్మించిన ఈ ఐకానిక్ ఆలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14న ప్రారంభించారు. భక్తుల సందర్శన కోసం ఆలయాన్ని మార్చి 1న తెరిచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నెలరోజుల వ్యవధిలో 3.50 లక్షల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. గత నెల రోజుల్లో ప్రతీ వీకెండ్(శని, ఆదివారాల్లో)లో దాదాపు 50వేల మంది ఆలయాన్ని సందర్శించారని తెలిపారు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ లెక్కన ప్రతినెలా 27 రోజులే ఆలయం తెరిచి ఉంటుంది. అబుధాబిలోని అబు మురీఖా ఏరియాలో ఉన్న 27 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆలయంలో మంగళవారం నుంచి ఆదివారం వరకు రోజూ రాత్రి 7.30 గంటలకు గంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ఆలయం వద్దనున్న స్వామినారాయణ ఘాట్ ఒడ్డున ఈ పూజలు జరుగుతాయి. భారతదేశం నుంచి తీసుకెళ్లిన గంగా, యమునా పవిత్ర జలాలతో స్వామినారాయణ ఘాట్‌ ఉంటుంది.

Tags:    

Similar News