ఎండల ఎఫెక్ట్.. కరిగిపోయిన ‘అబ్రహం లింకన్’ !

దిశ, నేషనల్ బ్యూరో : కుర్చీలో ఉన్న ఈ మైనపు బొమ్మను చూశారా ? తల లేదేంటి అని ఆలోచిస్తున్నారా !!

Update: 2024-06-26 16:54 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కుర్చీలో ఉన్న ఈ మైనపు బొమ్మను చూశారా ? తల లేదేంటి అని ఆలోచిస్తున్నారా !! ఇది విఖ్యాత అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మైనపు బొమ్మ. మన దగ్గర 37.7 డిగ్రీల సెల్సీయస్ టెంపరేచర్ అంటే మామూలేే, కానీ అమెరికాలో అది చాలా ఎక్కువ. ఈ టెంపరేచర్‌కు తట్టుకోలేక కొవ్వొత్తిలా కరిగిపోయి.. ఏ భాగానికి ఆ భాగం విడిపోయి.. వాషింగ్టన్ డీసీలో ఉన్న ఆరు అడుగుల అబ్రహం లింకన్ మైనపు బొమ్మ ఇలా షేపును కోల్పోయింది. ఎండల ధాటికి లింకన్ మైనపు బొమ్మ తల తొలగిపోవడంతో దాన్ని స్థానిక అధికారులు సేకరించి భద్రపరిచారు. వాతావరణం మారగానే సెప్టెంబరుకల్లా మైనపు బొమ్మను రిపేర్ చేయించి, మునుపటి షేపుకు తీసుకొస్తామని సంబంధిత వర్గాలు ప్రకటించాయి.

Similar News