ఫస్ట్ నైట్ తర్వాత భార్య కళ్లు చూసి షాకైన యువకుడు.. విడాకులు కావాలని మొండిపట్టు

ప్రస్తుతం పెళ్లంటే బొమ్మలాట అని అనుకుంటున్నారు కొంతమంది జంటలు.

Update: 2024-05-29 08:47 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం పెళ్లంటే బొమ్మలాట అని అనుకుంటున్నారు కొంతమంది జంటలు. నచ్చినంత సేపు ఆడుకొని నచ్చనప్పుడు బొమ్మలను విసిరేసినట్టు, కావాలనుకోని పెళ్లి చేసుకుని, వద్దనుకున్నప్పుడు విడాకులు ఇచ్చి వదిలించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కలిసి ఉండేందుకు కారణాలు వెతకాల్సిందిపోయి, విడిపోయేందుకు వంకలు వెతుకుతున్నారు.

ఇటీవల కుర్కురే తీసుకురాలేదని ఓ మహిళ తన భర్తకు విడాకులిచ్చేందుకు యత్నించిందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వార్త సద్దుమణగక ముందే భార్య కళ్ళు నచ్చలేదని ఓ యువకుడు విడాకులు కోరుతున్నారు. ఈ ఘటన కువైట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కువైట్‌లోని అల్-సబాహియాకు చెందిన ఇంజనీర్‌కు ఇటీవల ఓ యువతితో వివాహం జరిగింది.

కాగా వివాహానంతరం మొటది రాత్రి ముగిసిన తరువాత యువకుడు యువతి కళ్లు చూసి విడాకు కావాలని పట్టుబట్టారు. భార్య కళ్లు పచ్చగా ఉండడమే ఇందుకు కారణం. నివేదిక ప్రకారం.. వధువుకు దృష్టిలోపం ఉంది. దీని కారణంగా కాంటాక్ట్ లెన్స్‌లు నిత్యం ధరించేది. అయితే మొదట్లో వధువు కళ్ళ రంగు నల్లగా ఉందని యువకుడు భావించారు.

ఈ నేపథ్యంలో పెళ్లి చూపుల్లోగానీ, కనీసం నిశ్చితార్థం తర్వాత సైతం యువకుడు వధువు కంటి రంగు గురించి ఆరా తీయలేదు. కాగా యథావిధిగా పెళ్లి జరుగుతున్న సమయంలోనూ వధువు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించింది. దీని కారణంగా వరుడికి ఆమె కంటి రంగు తెలియలేదు. అయితే అంగరంగ వైభవంగా వివాహం చేసిన పెద్దలు, ఆ తరువాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు.

కాగా ఫస్ట్ నైట్ తర్వాత భార్య అసలు కళ్ళను చూసి ఆ యువకుడు షాక్ అయ్యారు. తాను యువతి కళ్లు నల్లగా ఉంటాయని అనుకున్నానని, కాని పచ్చగా ఉన్నందున భవిష్యత్‌లో వధువు కళ్ల రంగు పుట్టే పిల్లలపై ప్రభావం చూపుతుందని యువకుడు ఆరోపిస్తూ తనకు విడాకులు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో వరుడితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు వధువు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. 


Similar News