Kerala:వయనాడ్‌లో ప్రళయం..ప్రజలను కాపాడిన చిలుక

కేరళలోని వయనాడ్‌లో కొండచరియాలు విరిగిన ప్రమాదంలో చిక్కుకోకుండా ఓ చిలుక కొందరిని రక్షించింది.

Update: 2024-08-08 14:08 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేరళ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వయనాడ్ లోని మెప్పాడిలో కొండచరియలు విరిగిపడి ఎంతో మంది మృత్యువాత పడ్డారు. కేరళలోని వయనాడ్‌లో కొండచరియాలు విరిగిన ప్రమాదంలో చిక్కుకోకుండా ఓ చిలుక కొందరిని రక్షించింది. వాస్తవానికి మూగజీవాలు వాతావరణ మార్పులను ముందే పసిగడతాయి. కొన్ని సార్లు విపత్తుల నుంచి మానవులను అప్రమత్తం కూడా చేస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే వయనాడ్ లో వెలుగులోకి వచ్చింది. వయనాడ్‌లో ప్రళయం సంభవించింది. ఈ ఘటనలో చాలా మంది మృతి చెందారు. అయితే ప్రమాదానికి ముందు రోజు వినోద్ అనే వ్యక్తి తన చిలుక (కింగిని)తో సోదరి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా అది బిగ్గరగా అరుస్తూ పంజరాన్ని నోటితో పొడుస్తూ ప్రకృతి విపత్తు పై హెచ్చరించింది. వెంటనే వినోద్ ఎంటీ కింగిని ఇలా అరుస్తుంది అని ఆలోచించారు. వెంటనే తేరుకున్న వినోద్ పొరుగువారిని అలర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. ప్రమాదం పొంచి ఉన్నదాని అలర్ట్ చేశాడు. మూగజీవులకు విపత్తులను పసిగట్టే గుణం ఉంటుంది.

Tags:    

Similar News