మొసలికి మొగుడు.. క్రొకోడైల్ ను ముద్దుల్లో ముంచి పెళ్లి చేసుకున్న మేయర్..
పెళ్లంటే ఆడ, మగ చేసుకుంటారు. అయితే వధువుకు గానీ, వరుడికి కానీ ఏదైనా దోషం ఉన్నప్పుడు ఏదైనా జంతువుతోనో లేదా చెట్టుతోనో వివాహం జరిపిస్తారు.
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లంటే ఆడ, మగ చేసుకుంటారు. అయితే వధువుకు గానీ, వరుడికి కానీ ఏదైనా దోషం ఉన్నప్పుడు ఏదైనా జంతువుతోనో లేదా చెట్టుతోనో వివాహం జరిపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ట్రాన్స్‌జెండర్లు కూడా పెళ్లిలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగాళ్లు కూడా పెళ్లిల్లు చేసుకోవడం చూస్తున్నాం. కానీ ఓ నగర మేయర్ ఏకంగా ఓ మొసలిని వివాహం చేసుకున్నాడు. వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అయినా మనుషులను తినే కౄర జంతువును పెళ్లి చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా. కానీ అది నిజం. మరి ఈ విచిత్ర వివాహం చేసుకున్న మేయర్ ఎవరు, ఎందుకు మొసలిని మనువాడాడో ఇప్పుడు తెలుసుకుందాం..
అలిసియా అడ్రియానా అనే ఆడ మొసలిని మెక్సికోలోని శాన్ పెడ్రో హువామెలులా నగర మేయర్ విక్టర్ హ్యూగో పెళ్లి చేసుకున్నాడు. అక్కడిప్రజలు ఈ వివాహవేడుకను ఊరేగింపుగా వచ్చి జరిపించారు. ఈ వేడుకలో మొసలిని అందంగా ముస్తాబు చేసి ఊరేగింపుగా తిప్పారు. ఆ సమయంలో మొసలి ఎవరిపైనా దాడి చేయకుండా దాని నోటికి కట్టు కడతారట. మొసలిని వివాహం చేసుకునే సమయంలో మేయర్ మొసలి బాధ్యత తనదే అని ప్రమాణం కూడా చేశాడట. ఆ తరువాత మొసలిని ముద్దాడి పెళ్లి చేసుకున్నాడట.
అయితే అక్కడి ప్రజలు వరుడిని చొంటల్ రాజుగా.. మొసలిని రాణిగా భావిస్తారు. మధ్య అమెరికాలోని మెక్సికో నగరంలో ఈ ఆచారం వందల ఏళ్ల నుంచి వస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. చొంటల్, హువావె జాతుల్లోని ప్రజల మధ్య శాంతి పెంపొందించాలనే ఈ ఆచారాన్ని పాటిస్తారని అక్కడి వారు చెబుతున్నారు. 230 ఏండ్ల క్రితం ఈ ఆచారం మొదలైందని ఇప్పటికీ దీన్ని కొనసాగిస్తున్నారని అక్కడివారు చెబుతారు. ఇలా వివాహం చేయడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు మంచి జరుగుతుందని వారి నమ్మకం.