కామెరూన్‌లో తొక్కిసలాట..8మంది మృతి

Update: 2022-01-25 16:46 GMT

యౌండే : కామెరూన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు సోమవారం భారీగా ప్రేక్షకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. కామెరూన్‌లోని పాల్ బియో స్టేడియం సామర్థ్యం 60 వేలయితే, కొవిడ్ నేపథ్యంలో స్టేడియం నిర్వాహకులు కేవలం 60 శాతం మందినే అనుమతించారు.

ఆ తర్వాత ఈ సంఖ్యను 80 శాతానికి పెంచుతూ గేట్స్ ఓపెన్ చేయగా.. ఫ్యాన్ జోన్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట వల్ల 8 మంది మరణించగా, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టు కాన్ఫెడెరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్‌బాల్ (సీఏఎఫ్) ప్రకటించింది.

Tags:    

Similar News