20 వేల మంది సైనికుల మృతి.. వాగ్నర్ చీఫ్ కీలక ప్రకటన

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం గత తొమ్మిది నెలలుగా కొనసాగుతూనే ఉంది. దీంతో ఇరు దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారు.

Update: 2023-05-25 04:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్దం గత తొమ్మిది నెలలుగా కొనసాగుతూనే ఉంది. దీంతో ఇరు దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారు. రష్యా తన దాడులను తీవ్రతరం చేసినప్పటికి అంతే స్థాయిలో ఉక్రెయిన్ కూడా రష్యా దాడలను తిప్పికొడుతూ వస్తుంది. 9 నెలలుగా సాగుతున్న ఈ భీకర పోరులో తమ సైనికులు 20 వేల మంది చనిపోయినట్టు ప్రైవేటు సైన్యం వాగ్నర్‌ గ్రూపు (Wagner Group) అధిపతి వెల్లడించారు. అలాగే.. ఉక్రెయిన్‌‌తో యుద్ధానికి నియమించుకున్న మొత్తం 50 వేల మంది రష్యన్‌ ఖైదీలలో సగం మంది ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు. కానీ రష్యా మాత్రం ఉక్రెయిన్ యుద్ధంలో తమ సైనికులు ఇప్పటి వరకు కేవలం 6 వేల మంది మాత్రమే చనిపోయారని ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది.

Tags:    

Similar News