సింగర్‌లా కనిపించడం కోసం ఏకంగా 12 ప్లాస్టిక్ సర్జరీలు.. ఇన్ఫెక్షన్‌తో మృతి..
ప్రస్తుత రోజుల్లో చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాలని ఎన్నో కష్టాలు పడుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాలని ఎన్నో కష్టాలు పడుతున్నారు. వెండితెరపై మెరిసిపోవాలని, అందంగా కనిపిస్తే తొందరగా అవకాశాలు వస్తాయని సర్జరీలు చేయించుకుంటున్నారు. కొంతమందికి ఈ సర్జరీ విజయవంతంగా కంప్లీట్ అయి ఆరోగ్యంగా ఉంటున్నప్పటికీ.. మరికొంతమంది విషయంలో సర్జరీ ఫెయిల్ అయి వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అయితే ఈ విధంగానే 22 ఏళ్ల వాన్ కొలూచీ అనే ఓ యువకుడు పాపులర్ బీటీఎస్ సింగర్‌లా కనిపించాలని ఏకంగా 12 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. పైగా 220,000 డాలర్లు ఖర్చు చేశాడు. యూఎస్ స్ట్రీమింగ్ నెట్వర్క్ కోసం కె- పాప్ సింగర్ పాత్రను పోషించేందుకు అతడి దవడలోని ఇంప్లాంట్లను తీసివేయడానికి శనివారం రాత్రి సర్జరీ చేయించుకోవడం జరిగింది. దీంతో ఇంప్లాంట్ల నుంచి ఇన్ఫెక్షన్ సోకడంతో.. దానికి సంబంధించి ఓ ఇంజక్షన్ తీసుకున్నాడు.
అనంతరం కొన్ని గంటల సమయంలోనే వాన్ కొలూచీ గత ఆదివారం ఉదయం దక్షిణ కొరియా హాస్పిటల్ లో మృతిచెందారని aceshowbiz.com తెలిపింది. వాన్ కొలూచీ 6 అడుగుల ఎత్తు, 182 పౌండ్ల బరువు, ముదురు గోల్డ్ కలర్ జుట్టు, నీలి రంగు కళ్లతో ఉండేవాడని పేర్కొన్నారు. అతడి ఆకారం తనకే నచ్చకపోయేదట. చాలా అభద్రతా భావానికి లోనయ్యాడని, కొలూచీకు చతురస్రాకార దవడ, గడ్డం ఉండేదని, ఇలా చాలా మంది ఆసియన్లకు ఉండే లుక్ అయినా తనకు నచ్చలేదని వెల్లడించారు.
ఇతడు గత సంవత్సరంలోనే దవడ శస్త్రచికిత్స, ఇంప్లాంట్లు, ఫేస్ లిఫ్ట్, ముక్కు పని, కంటి లిఫ్ట్, కనుబొమ్మ లిఫ్ట్, పెదవి తగ్గింపుతో పాటు మొత్తం 12 సర్జరీలు జరిగాయట. దవడ ఇంప్లాంట్ శస్త్రచికిత్స ఎంత ప్రమాదకరమో కొలూచికి తెలిసినా కూడా.. అతడు ఆ సర్జరీ చేయించుకునేందుకు వెనకడుగు వేయలేదట. కాగా.. కొరియన్ డ్రామా ‘‘ప్రెటీ లైస్’’ చిత్రీకరణను గత ఏడాది జూన్ నెలలో ప్రారంభించిన వాన్ కొలూచీ డిసెంబర్‌లో షూటింగ్ పూర్తి చేశారు. అలాగే అంతర్జాతీయ విద్యార్థిగా ప్రధాన రోల్‌లో కూడా నటించాడు.