వైమానిక దాడిలో చిన్నారులు సహా 100 మంది మృతి
సైనికుల వైమానిక దాడిలో చిన్నారులు సహా 100 మంది మృతిచెందారు. ఈ విషాద సంఘటన మయన్మార్‌లో చోటు చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: సైనికుల వైమానిక దాడిలో చిన్నారులు సహా 100 మంది మృతిచెందారు. ఈ విషాద సంఘటన మయన్మార్‌లో చోటు చేసుకుంది. ఆర్మీ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన వేడుకకు బాధితులు హాజరయ్యారు. దీంతో సైన్యం యుద్దవిమానం సహాయంతో సదరు గ్రామంపై బాంబులతో దాడి చేసింది. దీంతో చిన్న పిల్లలు సహా.. మొత్తం 100 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 2021లో సైనిక తిరుగుబాటులో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి 3,000 మందికి పైగా పౌరులు మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి: 139 కి.మీ. సైకిల్ తొక్కి మరీ తల్లిపై అమ్మమ్మకు ఫిర్యాదు...