కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి.. 42 మంది మిస్సింగ్..

ఇండోనేషియాలోని రిమోట్ నటునా రీజెన్సీలోని ఒక ద్వీపంలోని గ్రామాలపై కుండపోత వర్షాల కురుస్తున్నాయి.

Update: 2023-03-07 08:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండోనేషియాలోని రిమోట్ నటునా రీజెన్సీలోని ఒక ద్వీపంలోని గ్రామాలపై కుండపోత వర్షాల కురుస్తున్నాయి. దీంతో భారీ కొండచరియలు విరిగిపడటంతో 10 మంది మృతి చెందగా.. మరో 42 మంది తప్పిపోయినట్లు ఆ ప్రాంత విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా సముద్రపు అలలు ఎగిపడటం.

ఒక్కసారిగి కొండచరియలు విరిగిపడటంతో చిన్న దీవిలో ఉన్న సుమారు 27 ఇండ్లలోని ప్రజలు తప్పిపోయినట్లు తెలుస్తుంది. అయితే భారీ వర్షాలకు వారంతా ఎటైన కొట్టుకుపోయారా.. లేక.. కొండచరియల కింద చిక్కుకున్నారా అని పోలీసులు, రక్షణ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News