ప్రపంచంలోని పులుల్లో 70శాతం భారత్‌లోనే..
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం మొత్తం మీద ఉన్న పులుల సంఖ్యలో 70 శాతం భారత్ లోనే ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా దేశంలో పులుల గణాంకాలతో కూడిన నివేదికను మంగళవారం ఆయన విడుదల చేశారు. ”ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. ఇందుకు భారత్ ఎంతో గర్వపడుతోందన్నారు. పులుల సంఖ్యను పెంచేందుకు టైగర్ రిజర్వులు ఉన్న 13 […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం మొత్తం మీద ఉన్న పులుల సంఖ్యలో 70 శాతం భారత్ లోనే ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తెలిపారు. జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా దేశంలో పులుల గణాంకాలతో కూడిన నివేదికను మంగళవారం ఆయన విడుదల చేశారు. ”ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 70 శాతం మన దేశంలోనే ఉన్నాయి. ఇందుకు భారత్ ఎంతో గర్వపడుతోందన్నారు. పులుల సంఖ్యను పెంచేందుకు టైగర్ రిజర్వులు ఉన్న 13 దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
1973లో మనకు కేవలం 9టైగర్ రిజర్వులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 50కి చేరింది. ప్రపంచ జీవన వైవిధ్యంలో ఎనిమిది శాతం భారతదేశంలోఉంది” అని తెలిపారు.అలానే అంతర్జాతీయంగా మనకు ఎన్నో ఆకర్షణలు ఉన్నాయని, వాటిలో వన్యప్రాణి సంపద ఎంతో ముఖ్యమైనదని మంత్రి వివరించారు.
భారత్‌లో 30 వేల ఏనుగులు, 3 వేల ఖడ్గమృగాలు, 500 సింహాలు ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. గణాంకాల ప్రకారం పులుల సంఖ్యలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2018 పులుల గణన గిన్నిస్ రికార్డులకెక్కిన సంగతి తెలిసిందే. కెమెరాల ద్వారా బంధించిన అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా గిన్నిస్‌బుక్ దీనిని గుర్తించి ధృవీకరణ పత్రం జారీ చేసింది.