అలంకరణ కోసం కాకుండా… ఆత్మగౌరవం కోసం జరపాలి
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఆదివాసీ, గిరిజనుల మధ్య చిచ్చుపెడుతూ పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని స్పర్శ అధ్యయన వేదిక అధ్యక్షుడు కాకి భాస్కర్ అన్నారు. ప్రపంచ ఆదివాసీల గిరిజన దినోత్సవాన్ని అలంకరణ కోసమే కాకుండా హక్కులు, ఆత్మగౌరవం కోసం జరపాలని హితవు పలికారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో సేవాలాల్ సేన ఆధర్వంలో జరిగిన ప్రపంచ ఆదివాసుల గిరిజన దినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. దేశంలో ఆదివాసీ చట్టాలు అమలు కావడం లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఆదివాసీ, గిరిజనుల మధ్య చిచ్చుపెడుతూ పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని స్పర్శ అధ్యయన వేదిక అధ్యక్షుడు కాకి భాస్కర్ అన్నారు. ప్రపంచ ఆదివాసీల గిరిజన దినోత్సవాన్ని అలంకరణ కోసమే కాకుండా హక్కులు, ఆత్మగౌరవం కోసం జరపాలని హితవు పలికారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో సేవాలాల్ సేన ఆధర్వంలో జరిగిన ప్రపంచ ఆదివాసుల గిరిజన దినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు.
దేశంలో ఆదివాసీ చట్టాలు అమలు కావడం లేదని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుకు శ్రద్ధ చూపకపోవడంతో ఆదివాసీలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నారని అన్నారు. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ… గిరిజన ఆదివాసీల ఉనికిని చట్టాన్ని జీవో 3 ను రద్దు చేసి గిరిజన ఆదివాసులను విద్యకు మరియు ఉద్యోగానికి దూరంచేస్తున్నారు. గిరిజనులను ఆదివాసీలను, సంచార జాతులను ఐక్యం చేసి మరో పోరాటానికి సిద్ధం చేయడం ద్వారానే గిరిజన సమాజం ఉనికి కాపాడుతుంది అన్నారు.