బ్యాడ్మింటన్‌కు గుడ్‌బై చెప్పనున్న తై జు
దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తై జు యింగ్ ఆటకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది ఆఖర్లో బ్యాడ్మింటన్ నుంచి తప్పుకోవాలని భావించినా, ఒలంపిక్స్ క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2021 ఒలంపిక్ క్రీడల అనంతరం ఆట నుంచి వైదొలగనున్నట్లు సమాచారం. ‘తాను వచ్చే సీజన్ అనంతరం ఆటకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే వచ్చే సీజన్‌ను పూర్తి చేయాలని […]
దిశ, స్పోర్ట్స్: వరల్డ్ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తై జు యింగ్ ఆటకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది ఆఖర్లో బ్యాడ్మింటన్ నుంచి తప్పుకోవాలని భావించినా, ఒలంపిక్స్ క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2021 ఒలంపిక్ క్రీడల అనంతరం ఆట నుంచి వైదొలగనున్నట్లు సమాచారం. ‘తాను వచ్చే సీజన్ అనంతరం ఆటకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే వచ్చే సీజన్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తాను’ అని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్)కు తై జు సమాచారం అందించింది. కరోనా కారణంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని మరింత ఫిట్‌గా తయారవ్వడానికి ఉపయోగించుకుంటున్నానని తెలిపింది.