Rinku Singh : కేకేఆర్ కెప్టెన్సీపై రింకూ సింగ్ కీలక వ్యాఖ్యలు
విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా రింకూ సింగ్ శుక్రవారం నియమితుడయ్యాడు.
దిశ, స్పోర్ట్స్ : విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కెప్టెన్‌గా రింకూ సింగ్ శుక్రవారం నియమితుడయ్యాడు. తద్వారా సీనియర్ స్థాయి రాష్ట్ర జట్టుకు తొలి సారి రింకూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫోతో ఈ సందర్భంగా రింకూ మాట్లాడాడు. ‘రానున్న ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్సీ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. యూపీ జట్టును గెలిపించడంపైనే దృష్టి సారించాను. 2015-16 తిరిగి యూపీ జట్టుకు ట్రోఫీ అందించడమే లక్ష్యం. గతేడాది ఐపీఎల్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సులు బాదినప్పుడు టీంఇండియాలో చాన్స్ వస్తుందనుకోలేదు. నా జీవితంలో అదే గేమ్ చేంజర్.’ అని రింకూ అన్నాడు.
పంజాబ్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మ
విజయ్ హజారే ట్రోఫీకి పంజాబ్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మ ఎంపికయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సైతం పంజాబ్ జట్టును అభిషేక్ శర్మ ముందుండి నడిపించాడు. గతేడాది ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. భారత్ తరఫున ఇటీవల వరుసగా అవకాశాలు పొందుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ సైతం ఈ ఆటగాడిని ఇటీవల రిటైన్ చేసుకుంది. విజయ్ హజారే ట్రోఫీకి అభిషేక్ శర్మను కెప్టెన్ గా నియమిస్తున్నట్లు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది.