PKL 11:ప్లే ఆఫ్స్‌కు జైపూర్ పింక్ పాంథర్స్.. రేసు నుంచి పుణెరి పల్టన్ ఔట్
దిశ, స్పోర్ట్స్ : జైపూర్ పింక్ పాంథర్స్ ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 ప్లే ఆఫ్స్‌కు చేరింది. శుక్రవారం పూణేలోని బలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31-28 తేడాతో పింక్ పాంథర్స్ విజయం సాధించింది. చివరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 9, అభిజిత్ మాలిక్ 7, రెజా మిర్బగేరి 5 పాయింట్లు సాధించారు. జైపూర్ విజయంతో పుణెరి పల్టన్ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. బెంగాల్ వారియర్స్ తొలి తొమ్మిది నిమిషాల్లో 6 పాయింట్లు సాధించి లీడ్‌లోకి వచ్చింది. తర్వాత కేవలం రెండు నిమిషాల వ్యవధిలో అభిజిత్ మాలిక్ దూకుడుగా ఆడటంతో వరుసగా పాయింట్లు సాధించింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి బెంగాల్ వారియర్స్ 19-9 పాయింట్లతో భారీ లీడ్ సాధించింది. కానీ జైపూర్ పింక్ పాంథర్స్ సెకండ్ హాఫ్‌లో వరుసగా రెండు సూపర్ ట్యాకిల్స్ చేసి క్రమంగా ఆధిక్యాన్ని తగ్గిస్తూ వచ్చింది. ఆట 8 నిమిషాల్లో ముగుస్తుందనగా పింక్ పాంథర్స్ బెంగాల్ జట్టును ఆల్ అవుట్ చేసింది. ఆట మూడు నిమిషాలు ఉందనగా రెండు జట్లు 27-27 పాయింట్లతో స్కోరును సమం చేశాయి. జైపూర్ పింక్ పాంథర్స్ ఒక్కసారిగా ఆటలో దూకుడు ప్రదర్శించింది. అద్భుతమైన డిఫెండింగ్‌తో మూడు పాయింట్లు రాబట్టింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌నే విజయం వరించింది.