బ్రిస్బేన్‌లో ఫాలో ఆన్ వేడుకలను సమర్ధిస్తా.. రవిశాస్త్రి
బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ ఫాలో ఆన్ గండం తప్పడంతో చేసుకున్న సంబరాలను సమర్ధిస్తా అని భారత మాజీ కోచ్ రవిశాస్ర్తి అన్నాడు.
దిశ, స్పోర్ట్స్ : బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ ఫాలో ఆన్ గండం తప్పడంతో చేసుకున్న సంబరాలను సమర్ధిస్తా అని భారత మాజీ కోచ్ రవిశాస్ర్తి అన్నాడు. శుక్రవారం ఐసీసీ రివ్యూలో ఆయన మాట్లాడారు. ‘మీరంతా సంబరాలు చేసుకోవచ్చు. చివరి వికెట్‌కు 35-36 పరుగులు చేయడం గొప్ప విషయం. సిరీస్ ప్రాధాన్యత గురించి జట్టు సభ్యులకు తెలుసు. ఫాలో ఆన్ గండం గట్టెక్కడం, వెంటనే ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చడం అద్భుతం. 2021లో ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బుమ్రా, షమీ లార్డ్స్ మైదానంలో ఇలాంటి ప్రదర్శనే చేశారు. చివరి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. ఆ టెస్ట్ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్ చివరకు మ్యాచ్ ఓడిపోయింది.’ అని శాస్త్రి అన్నాడు. ఇటీవల భారత్ విజయాల్లో టైలండర్ల కీలక పాత్ర పోషిస్తున్నారన్నాడు. గతంలో అశ్విన్, హనుమ విహారీ సిడ్నీలో అద్భుతంగా పోరాడారు. చివరి సెషన్ మొత్తం ఆడి మ్యాచ్ ఓడిపోకుండా కాపాడారు. తదుపరి గబ్బాలో జరిగిన టెస్ట్‌లో గెలవడం ద్వారా భారత్ సిరీస్ గెలుచుకుందని ఆయన గుర్తు చేశాడు.