ట్రాక్టర్ పై నుండి పడి డ్రైవర్ మృతి
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పై నుండి పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలోని ఆరెగూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది
దిశ,వెల్దుర్తి : పొలం దున్నుతుండగా ట్రాక్టర్ పై నుండి పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలోని ఆరెగూడెం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన డ్రైవర్ మెరుగు ప్రభాకర్ (40) అదే గ్రామానికి చెందిన కుక్కల శంకర్ ట్రాక్టర్ తో శంకర్ పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి తలకు తీవ్రంగా తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.