అది అసలు.. పరిష్కారమే కాదు : డబ్ల్యూహెచ్‌వో

నీవా: హెర్డ్ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాలని, అది అసలు పరిష్కారమే కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. కరోనాను నిలువరించే హెర్డ్ ఇమ్యూనిటీ దశకు ప్రపంచం సుదూరంలో ఉన్నదని పేర్కొంది. కరోనా సోకకుండా సరిపడా జనాభా యాంటీబాడీలను అభివృద్ధి చేసుకుని వైరస్‌కు చెక్ పెట్టడాన్నే హెర్డ్ ఇమ్యూనిటీగా పరిగణిస్తున్నారు. టీకా వేసుకుని 70 శాతం జనాభా యాంటీబాడీలను అభివృద్ధి చేసుకుంటే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ వాదనలపై డబ్ల్యూహెచ్‌వో అసలు ఆశలే పెట్టుకోవద్దని […]

Update: 2020-08-19 10:25 GMT

నీవా: హెర్డ్ ఇమ్యూనిటీపై ఆశలు వదులుకోవాలని, అది అసలు పరిష్కారమే కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. కరోనాను నిలువరించే హెర్డ్ ఇమ్యూనిటీ దశకు ప్రపంచం సుదూరంలో ఉన్నదని పేర్కొంది. కరోనా సోకకుండా సరిపడా జనాభా యాంటీబాడీలను అభివృద్ధి చేసుకుని వైరస్‌కు చెక్ పెట్టడాన్నే హెర్డ్ ఇమ్యూనిటీగా పరిగణిస్తున్నారు. టీకా వేసుకుని 70 శాతం జనాభా యాంటీబాడీలను అభివృద్ధి చేసుకుంటే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

హెర్డ్ ఇమ్యూనిటీ వాదనలపై డబ్ల్యూహెచ్‌వో అసలు ఆశలే పెట్టుకోవద్దని తాజాగా కుండబద్దలు కొట్టింది. హెర్డ్ ఇమ్యూనిటీకా కావల్సినంత మందిలో ఇమ్యూనిటీ లేదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 నుంచి 20 శాతం మందిలోనే యాంటీ బాడీలున్నట్టు చాలా అధ్యయనాలు వెల్లడించాయని పేర్కొంది. కాబట్టి, ‘హెర్డ్ ఇమ్యూనిటీ అసలు పరిష్కారమే కాదు. మనం హెర్డ్ ఇమ్యూనిటీ అనే పరిష్కారం కోసమూ చూడొద్దు’ అని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.

Tags:    

Similar News