2021 వరల్డ్‌కప్ కూడా తరలిస్తాం : ఐసీసీ

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహించే అధికారం కేవలం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కే ఉంటుందని, ఏ మెగా టోర్నీని తరలించాలన్నా మా అనుమతి తప్పనిసరి అని ఐసీసీ స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఐసీసీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గత రెండు నెలలుగా జరిగిన ఈ-మెయిల్ సంభాషణలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయాలని ప్రాథమికంగా నిర్దారించిన నేపథ్యంలో గతంలో జరిగిన సంభాషణలు వెలుగులోనికి రావడం చర్చనీయాంశమైంది. కొవిడ్-19 […]

Update: 2020-05-27 10:12 GMT

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహించే అధికారం కేవలం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కే ఉంటుందని, ఏ మెగా టోర్నీని తరలించాలన్నా మా అనుమతి తప్పనిసరి అని ఐసీసీ స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఐసీసీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గత రెండు నెలలుగా జరిగిన ఈ-మెయిల్ సంభాషణలు బయటకు వచ్చాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేయాలని ప్రాథమికంగా నిర్దారించిన నేపథ్యంలో గతంలో జరిగిన సంభాషణలు వెలుగులోనికి రావడం చర్చనీయాంశమైంది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో క్రికెట్ నిలిచిపోయిన కారణంగా క్రికెట్‌ను పునః ప్రారంభించాలని ఐసీసీ భావించింది. ఈ సందర్భంగా జరిగిన ఈ-మెయిల్ సంభాషణలను ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ వెలుగులోకి తెచ్చింది.
కొవిడ్ సంక్షోభాన్ని పక్కకు పెడితే ఎన్నో ఏండ్లుగా భారత ప్రభుత్వం, ఐసీసీకి మధ్య నలుగుతున్న పన్నుల వివాదాన్ని వెంటనే బీసీసీఐ పరిష్కరించాలని, లేకపోతే 2021లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ను అక్కడి నుంచి తరలిస్తామని హెచ్చరించింది. ఈ విషయమై 2019 డిసెంబర్ 31 నాటికి పూర్తి నివేదిక ఇవ్వాలని ఐసీసీ కోరినా ఇంత వరకు బీసీసీఐ సమాధానం ఇవ్వలేదు. అయితే, బీసీసీఐ అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జూన్ 30 వరకు ఐసీసీ మరో అవకాశం ఇచ్చింది. దీనిపై సమాధానం ఇస్తేనే వచ్చే ఏడాది ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది.

Tags:    

Similar News