‘చైనా చొరబాట్ల పై నిజాలు మాట్లాడుతా’

న్యూఢిల్లీ: చైనా చొరబాట్లపై నిర్భయంగా నిజాలు మాట్లాడుతూనే ఉంటానని, తన రాజకీయ జీవితం నాశనమైనా వెనక్కితగ్గబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. లడాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకోలేదని అబద్ధాలు చెబుతున్నవారే జాతీయవాదులు, దేశభక్తులు కారని స్పష్టం చేశారు. లడాఖ్‌లో చైనా బలగాలు ఆక్రమణలు సాగుతూనే ఉన్నాయని అన్నారు. భారత భూభాగాల్లోకి చైనా చొరబడిందని ఇప్పుడు అందరికీ తెలిసిందని, చైనా ఆర్మీ చొచ్చుకురావడం తనకు అసహనాన్ని కలిగిస్తోందని రాహుల్ చెప్పారు. తన రక్తం మరుగుతోందన్నారు. […]

Update: 2020-07-27 07:01 GMT

న్యూఢిల్లీ: చైనా చొరబాట్లపై నిర్భయంగా నిజాలు మాట్లాడుతూనే ఉంటానని, తన రాజకీయ జీవితం నాశనమైనా వెనక్కితగ్గబోనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. లడాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకోలేదని అబద్ధాలు చెబుతున్నవారే జాతీయవాదులు, దేశభక్తులు కారని స్పష్టం చేశారు. లడాఖ్‌లో చైనా బలగాలు ఆక్రమణలు సాగుతూనే ఉన్నాయని అన్నారు. భారత భూభాగాల్లోకి చైనా చొరబడిందని ఇప్పుడు అందరికీ తెలిసిందని,

చైనా ఆర్మీ చొచ్చుకురావడం తనకు అసహనాన్ని కలిగిస్తోందని రాహుల్ చెప్పారు. తన రక్తం మరుగుతోందన్నారు. మనదేశంలోకి ఒక పొరుగుదేశం ఎలా రాగలదు? అని ప్రశ్నించారు. సరిహద్దు వ్యాఖ్యలపై బీజేపీ విమర్శించడాన్ని తప్పుబట్టారు. నిజాలను కప్పిపెట్టి చైనాను ఆక్రమించుకోనిచ్చేవారే దేశద్రోహులని, ఆ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడమే దేశభక్తి అని తెలిపారు. అందుకే చైనా చొరబాట్లపై ఎప్పటికీ నిర్భయంగా మాట్లాడుతూనే ఉంటారని చెప్పారు. దాని తర్వాత తనకు రాజకీయ జీవితమే లేకుండా పోయినా పర్లేదని, భారత భూభాగాలపై ఎప్పటికీ నిజాయితీగా మాట్లాడతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Tags:    

Similar News