వీర జవాన్ల మరణాలు వృథా కావు : ప్రధాని

న్యూఢిల్లీ: లడాఖ్‌లోని గాల్వాన్ లోయ గుండా పోతున్న భారత్, చైనా సరిహద్దులో హింసాత్మక ఘర్షణల్లో మరణించిన 20మంది వీరజవాన్ల ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అమరులైన వీరుల మరణాలు వృథాగా పోనివ్వమని దేశానికి హామీ ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌కు ముందు ఆయన రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళ్లర్పించారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది కానీ, రెచ్చగొడితే మాత్రం ఎటువంటి పరిస్థతుల్లోనైనా తగిన జవాబు ఇచ్చే సామర్థ్యమున్నదని అన్నారు. దేశ సార్వభౌమత్వం, […]

Update: 2020-06-17 05:05 GMT

న్యూఢిల్లీ: లడాఖ్‌లోని గాల్వాన్ లోయ గుండా పోతున్న భారత్, చైనా సరిహద్దులో హింసాత్మక ఘర్షణల్లో మరణించిన 20మంది వీరజవాన్ల ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అమరులైన వీరుల మరణాలు వృథాగా పోనివ్వమని దేశానికి హామీ ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌కు ముందు ఆయన రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళ్లర్పించారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది కానీ, రెచ్చగొడితే మాత్రం ఎటువంటి పరిస్థతుల్లోనైనా తగిన జవాబు ఇచ్చే సామర్థ్యమున్నదని అన్నారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత ప్రధానమని తెలిపారు. ఇరుగుపొరుగువారి బాగోగులనే కోరుకుంటున్నాం కానీ, భారత్‌కే ప్రమాదకారిగా మారితే సహించేది లేదని వివరించారు. అందుకే వీర జవాన్ల మరణాలు వృథా కానివ్వబోమని హామీనిస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News