వయసు 8.. రికార్డులు తొమ్మిది
దిశ, ఫీచర్స్ : ఆ చిన్నారికి రికార్డులు కొత్తేం కాదు. ఐదేళ్ల వయస్సు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టి ఆ పరంపరను ఇంకా కొనసాగిస్తోంది ప్రవాస భారతీయ బాలిక మహాలక్ష్మి ఆనంద్.. కొల్లాంకు చెందిన ఇంజనీర్ ఆనంద్ కుమార్ వృత్తిరీత్యా అబుదాబిలో కుటుంబంతో స్థిరపడగా.. ఏడాదిన్నర వయసులోనే అక్షరాలు, దేశాలు, శాస్త్రవేత్తల పేర్లను మహాలక్ష్మి గుర్తుంచుకుని చెప్పడంతో ఆమె ప్రతిభను గుర్తించి పేరెంట్స్ మరెన్నో విషయాల్లో శిక్షణ అందిస్తున్నారు. KG-2 చదువుతున్న లిటిల్ జీనియస్ మహాలక్ష్మి నిమిషంలో […]
దిశ, ఫీచర్స్ : ఆ చిన్నారికి రికార్డులు కొత్తేం కాదు. ఐదేళ్ల వయస్సు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టి ఆ పరంపరను ఇంకా కొనసాగిస్తోంది ప్రవాస భారతీయ బాలిక మహాలక్ష్మి ఆనంద్.. కొల్లాంకు చెందిన ఇంజనీర్ ఆనంద్ కుమార్ వృత్తిరీత్యా అబుదాబిలో కుటుంబంతో స్థిరపడగా.. ఏడాదిన్నర వయసులోనే అక్షరాలు, దేశాలు, శాస్త్రవేత్తల పేర్లను మహాలక్ష్మి గుర్తుంచుకుని చెప్పడంతో ఆమె ప్రతిభను గుర్తించి పేరెంట్స్ మరెన్నో విషయాల్లో శిక్షణ అందిస్తున్నారు.
KG-2 చదువుతున్న లిటిల్ జీనియస్ మహాలక్ష్మి నిమిషంలో చాలామంది శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణలను గుర్తించి తన మొదటి రికార్డు టైటిల్‌ను ఐదేళ్ల వయస్సులో అందుకుని ఈ ఘనత వహించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది. అలాగే భారతదేశంలోని రాష్ట్రాలు. రాజధానులను అక్షర క్రమంలో 26 సెకన్లలో రీకాల్ చేసి ఔరా అనిపించింది. ఇక భరతనాట్యంలో ఏడాదికంటే తక్కువ కాలం శిక్షణ పొందిన చిన్నారి.. మొత్తం 81 ముద్రల్లో 55 వ్యక్తీకరణలను 53 సెకన్లలో చేయడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు మూడు ప్రపంచ రికార్డులు (ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బ్రిటిష్ వరల్డ్ రికార్డ్స్, కాలామ్స్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ ఎక్స్‌ట్రార్డినరీ గ్రాపింగ్ పవర్ జీనియస్ కిడ్) ఆమెను వరించాయి.
‘చిన్న వయస్సు నుంచే ఆమె నేర్చుకోవాలనే ఆసక్తి కలిగి ఉంది. ఏదైనా నేర్పించిన లేదా పుస్తకంలో చూపించిన వాటిని గుర్తుంచుకుని చదవడంతో ఆమె సామర్థ్యాన్ని గ్రహించాం. ఆమె ఒకటిన్నర వయస్సున్నప్పుడు నేను ప్రభుత్వ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. తను వచ్చి నా పక్కన కూర్చోవడంతో శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణల గురించి నేర్పించడం ప్రారంభించాను. ఎంతవరకు గుర్తుంచుకుందో తెలుసుకోవడానికి రెండు రోజుల తర్వాత ప్రశ్నలడిగాను. ఆమె సమాధానాలు చెప్పడంతో ఆశ్చర్యపోయాను’ అని మహాలక్ష్మి తల్లి నీనా తెలపింది.