Uber: భారత్‌లో 'ఉబర్‌వన్' మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన ఉబర్
కస్టమర్ల విశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్యాబ్ సేవల ప్లాట్‌ఫామ్ ఉబర్ భారత మార్కెట్లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ 'ఉబర్‌వన్ 'ను ప్రారంభించింది. కస్టమర్ల విశ్వాసాన్ని పెంచే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఉబర్‌వన్ సేవలు అంతర్జాతీయంగా 2.5 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన ఉబర్‌వన్ ప్రోగ్రామ్‌ను రెండు ప్లాన్‌లలో అందిస్తోంది. అన్ని రకాల కస్టమర్లకు ఉపయోగపడేలా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 149తో, వార్షిక ప్లాన్ రూ. 1,499ను తీసుకొచ్చింది. మెంబర్‌షిప్ ఉన్నవారికి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయని కంపెనీ చెబుతోంది. ఒక ట్రిప్‌కు గరిష్ఠంగా రూ. 150 ఉండి, తరచూ ప్రయాణించేవారికి ప్రయోజనకరంగా ఉబర్ క్రెడిట్స్‌కు యాక్సెస్ పొందుతారు. అలాగే, జొమాటో గోల్డ్ కాంప్లిమెంటరీ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనం లభిస్తుంది.