Proud movement : తండ్రి అడుగుజాడల్లోనే తనయ.. మీకిదే ‘నా సెల్యూట్’

దిశ, వెబ్‌డెస్క్ : చిన్నతనంలో తమ పిల్లలకు నడక నేర్పించిన తల్లిదండ్రులు వారి కాళ్ల మీద వారు నిలబడినపుడు ఎంతో సంతోషిస్తారు. అలాంటిది తండ్రి లేదా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వారికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే ఆ తల్లిదండ్రుల ఆనందాలకు అవధులుండవు. ఇలా కొందరు పిల్లలు తల్లిదండ్రుల కోరికలను నేరవేర్చి వారి కళ్లల్లో తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. మరి కొంత మంది పేరెంట్స్ అయితే, వారు తమ జీవితంలో సాధించలేనివి తమ పిల్లల ద్వారా పొందాలనుకుంటారు. […]

Update: 2021-11-02 11:04 GMT

దిశ, వెబ్‌డెస్క్ : చిన్నతనంలో తమ పిల్లలకు నడక నేర్పించిన తల్లిదండ్రులు వారి కాళ్ల మీద వారు నిలబడినపుడు ఎంతో సంతోషిస్తారు. అలాంటిది తండ్రి లేదా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వారికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తే ఆ తల్లిదండ్రుల ఆనందాలకు అవధులుండవు. ఇలా కొందరు పిల్లలు తల్లిదండ్రుల కోరికలను నేరవేర్చి వారి కళ్లల్లో తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. మరి కొంత మంది పేరెంట్స్ అయితే, వారు తమ జీవితంలో సాధించలేనివి తమ పిల్లల ద్వారా పొందాలనుకుంటారు. వారి డ్రీమ్స్‌ను తమ పిల్లలతో షేర్ చేసుకుని, తాము చేరుకోలేని స్థాయికి తమ బిడ్డలైనా చేరుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఒకవేళ అదే జరిగినప్పుడు వారిలో కలిగే సంతోషాన్ని ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం.

తాజాగా ఓ పోలీసు ఆఫీసర్ తాను వర్క్ చేస్తున్న డిపార్ట్ మెంట్లోనే తన కూతురు కూడా ఓ ఉన్నతమైన హోదాలో విధులు నిర్వహిస్తుండటం చూసి ఎంతో ఆనందించాడు. నిజానికి అతనే తన కూతురి కంటే ఉన్నతాధికారి. కూతురు తండ్రి ఎదుట యూనిఫాంలో నిలబడి సెల్యూట్ చేస్తున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. వివరాల్లోకివెళితే.. ఏపీఎస్ నింబాడియా (ITBP) ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ విభాగంలో డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ (DIG) ర్యాంక్ అధికారి.

తన కూతురు అపేక్ష నింబాడియా అదే పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) ర్యాంక్ అధికారిణి. సోమవారం జరిగిన గ్రాడ్యూయేషన్ పరేడ్‌లో భాగంగా కూతురు అపేక్ష నింబాడియా తన తండ్రి ఏపీఎస్ నింబాడియాకు సెల్యూట్ చేసింది. మరుక్షణమే తన తండ్రి కూడా గర్వంతో ప్రతీ సెల్యూట్ చేస్తున్న దృశ్యాలను అక్కడి సిబ్బంది వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు్ చేశారు. అది కాస్త తెగ వైరల్ అవుతోంది. తండ్రి ఆశయాన్ని నిలబెట్టిన కూతురు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అపేక్ష ఉత్తరప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పోలీస్ అకాడమీలో తన గ్రాడ్యూయేషన్‌ను పూర్తిచేసింది.

Tags:    

Similar News