నిర్మల్‌లో అమ్మాయిల హల్ చల్.. అలా చేస్తూ యువకులను టార్గెట్ చేసి..
దిశ, వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లాలో అమ్మాయిలు రెచ్చిపోయారు. బైకులపై వెళ్తున్న యువకులను టార్గెట్ చేశారు. రోడ్డుకు అడ్డంగా వచ్చి బైక్‌లపై వెళ్తున్న వారిని అడ్డగించి డబ్బులు వసూల్ చేస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని బాసర, ధర్మాబాద్ ప్రాంతాల్లో ఈ వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే మూకుమ్మడిగా దాడులు చేస్తూ, బూతులు తిడుతూ.. విలువైన వస్తువులను దోచుకుంటున్నారు. ఇలా అమ్మాయిలు రెచ్చిపోవడంతో ఆ రూట్‌లో వెళ్లాలంటే వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాలో కొందరు […]
దిశ, వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లాలో అమ్మాయిలు రెచ్చిపోయారు. బైకులపై వెళ్తున్న యువకులను టార్గెట్ చేశారు. రోడ్డుకు అడ్డంగా వచ్చి బైక్‌లపై వెళ్తున్న వారిని అడ్డగించి డబ్బులు వసూల్ చేస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని బాసర, ధర్మాబాద్ ప్రాంతాల్లో ఈ వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే మూకుమ్మడిగా దాడులు చేస్తూ, బూతులు తిడుతూ.. విలువైన వస్తువులను దోచుకుంటున్నారు. ఇలా అమ్మాయిలు రెచ్చిపోవడంతో ఆ రూట్‌లో వెళ్లాలంటే వాహనదారులు భయంతో వణికిపోతున్నారు.
వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాలో కొందరు లేడీ డాన్లు బృందాలుగా విడిపోయి ఏరియాలను పంచుకుంటున్నారు. వీరు బైక్‌లపై వెళ్తున్న యువకులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో టీమ్‌లో ఎనిమిది మందికిపైగా సభ్యులుంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన అమ్మాయిలు టీమ్‌లుగా ఏర్పడి స్వచ్చంద సంస్థల పేరుతో వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు. కొందరు స్వచ్చంద సంస్థ పేరు చెప్పాలని నిలదీస్తే వారికి సమాధానం చెప్పకుండా బూతులు తిడుతున్నారని వాహనదారులు తెలిపారు.
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపైనా, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అమ్మాయిలే ఇలాంటి దందాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వారితో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వకుండా.. తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.