‘కారు’లో ఏం జరుగుతోంది.. హుజూరాబాద్‌లో ‘మహిళ’లు ఎక్కడ..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: బై పోల్స్‌లో తమ ప్రభావాన్ని చాటుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో వారికి అవకాశం కనిపించడం లేదా..? ఆకాశంలో సగం.. అవనిలో సగం అన్న విధానానికి అక్కడ స్వస్తి పలికారా…? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న సమావేశాలు, హుజురాబాద్‌లో బలమైన అభ్యర్థిగా ఉన్న ఈటలను ఓడించాలంటే టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు లాభదాయకమేనా అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. స్థానిక సంస్థల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న లక్ష్యంతో […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: బై పోల్స్‌లో తమ ప్రభావాన్ని చాటుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాల్లో వారికి అవకాశం కనిపించడం లేదా..? ఆకాశంలో సగం.. అవనిలో సగం అన్న విధానానికి అక్కడ స్వస్తి పలికారా…? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న సమావేశాలు, హుజురాబాద్‌లో బలమైన అభ్యర్థిగా ఉన్న ఈటలను ఓడించాలంటే టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు లాభదాయకమేనా అన్నదే అంతుచిక్కకుండా తయారైంది. స్థానిక సంస్థల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలన్న లక్ష్యంతో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన సర్కారు తన పార్టీ కార్యక్రమాల్లో మాత్రం వారికి ప్రయారిటీ కల్పించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈటల రాజీనామా తరువాత హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నా మహిళా ప్రజా ప్రతినిధులు కానీ, పార్టీ నాయకురాల్లు కానీ కనిపించకపోవడం విస్మయం కల్గిస్తోంది. నియోజకవర్గంలోని హుజురాబాద్, వీణవంక, ఇల్లందకుంట, కమలాపూర్, జమ్మికుంట మండలాలతో పాటు రెండు మునిసిపాలిటీల్లో కూడా సగానికి సగం మహిళా ప్రజాప్రతినిధులే ఎన్నికయ్యారు. వీరితో పాటు టీఆర్ఎస్ మహిళా విభాగం, సాధారణ కమిటీల్లో కూడా మహిళలు బాధ్యతలు నిర్వహిస్తున్నా.. వారు మాత్రం పార్టీ జరుపుతున్న సమీకరణాలకు దూరంగా ఉంటుండడం గమనార్హం. కొన్ని చోట్ల జరిగే సమావేశాలకు ఒకరిద్దరు మహిళలు మాత్రమే హాజరవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచే హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం చేపడుతున్న సన్నాహక సమావేశాల్లో మహిళలు కనిపించకపోవడం గమనార్హం.
పతులదే పెత్తనమా..?
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పతుల పేర్లను సంబోధిస్తూ అడ్రెస్ చేస్తున్నారు తప్ప మహిళా ప్రజా ప్రతినిధుల పేర్ల ఊసే ఎత్తడం లేదు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జరిగే సభల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడం విడ్డూరం.
ఆశావాహుల ఇలాకాయేనా..?
ఇటీవల నియోజకవర్గంలోని ఓ మండలంలో జరిగిన సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ హాజరయ్యారు. సమావేశానికి తక్కువగా హాజరైన జనాన్ని చూసి సదరు నాయకుడు అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఉప ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ఓ నాయకుని మండలంలో ఇంత పలుచగా జనం రావడం ఏంటీ..? సభలకు జనసమీకరణ చేయడం విఫలం అవుతున్నారెందుకు అంటూ మండి పడ్డారని తెలిసింది. ఇక ముందు జరగబోయే సమావేశాలకు ఈ పరిస్థితి రిపీట్ కావొద్దని మందలించినట్టు సమాచారం.