రహస్యంగా వీడియోలు తీసి.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి..
దిశ, వెబ్డెస్క్ : ఆశ్రయం కల్పించి ఆమెను పొందాలని చూశాడో ప్రబుద్దుడు. చెల్లి అని పిలుస్తూనే కామ కోర్కెలు తీర్చాలని వెంటపడ్డాడు. రహస్యంగా ఆమె వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పడక గదిలోకి రమ్మని వేధించాడో అన్న కాని అన్న. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో కథ రివర్స్ అయింది. ఓ యువతి ప్రైవేట్ జాబ్ చేయడం కోసం విశాఖపట్నానికి వచ్చింది. అక్కడ తనకు అన్న వరసయ్యే రామిరెడ్డి ఇంట్లో ఉంటూ సమీపంలోని ఆఫీస్లో డ్యూటీకి […]
దిశ, వెబ్డెస్క్ : ఆశ్రయం కల్పించి ఆమెను పొందాలని చూశాడో ప్రబుద్దుడు. చెల్లి అని పిలుస్తూనే కామ కోర్కెలు తీర్చాలని వెంటపడ్డాడు. రహస్యంగా ఆమె వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పడక గదిలోకి రమ్మని వేధించాడో అన్న కాని అన్న. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయంతో కథ రివర్స్ అయింది.
ఓ యువతి ప్రైవేట్ జాబ్ చేయడం కోసం విశాఖపట్నానికి వచ్చింది. అక్కడ తనకు అన్న వరసయ్యే రామిరెడ్డి ఇంట్లో ఉంటూ సమీపంలోని ఆఫీస్లో డ్యూటీకి వెళ్తోంది. ఆమెపై కన్నేసిన రామిరెడ్డి.. ఆమెను సొంతం చేసుకోవాలన్న దుర్భద్దితో రహస్యంగా యువతికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించాడు. ఆ తర్వాత చెల్లెలు అనే వరుసను కూడా మరిచిన కామాంధుడు తన కోర్కెలు తీర్చాలని బలవంతం చేశాడు. అందుకు అంగీకరించని యువతి.. ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరే దగ్గర ఉంటుంది. అయినా రామిరెడ్డి వేధింపులు ఆపకపోవడంతో విషయం తన ప్రియుడికి చెప్పింది.
యువతి ప్రియుడు కళ్యాణ్ మర్డర్ ప్లాన్ చేశారు. వావి వరసలు మరిచిన మృగాడిని అంతమెందించాలని నిర్ణయించుకున్నారు. ఇదేమి తెలియని రాంరెడ్డి.. జనవరి 27న యువతికి ఫోన్ చేసి తన కోర్కెను బయటపెట్టాడు. దానికి ఒప్పుకున్నట్లు నటించిన యువతి రాంరెడ్డిని సాయంత్రం రమ్మని ఆహ్వానించింది.
తన కలల రాణి.. కోర్కె తీర్చబోతుందని సంతోషంగా వెళ్లిన రాంరెడ్డిని ఆమెను తీసుకోని ఎన్టీపీసీ సమీపంలోని సోమునాయుడు పాలెం ప్రాంతానికి తీసుకెళ్లాడు. పధకం ప్రకారం యువతి రాంరెడ్డిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లింది. వారిద్దరిని ఫాలో అయిన ఆమె ప్రియుడు కళ్యాణ్, అతడి స్నేహితుడు వెనక నుంచి వెళ్లి రాంరెడ్డి తలపై కర్రతో బలంగా మోదారు. వెంటనే పడిపోయిన అతడిని యువతి చున్నీతో మెడకు బిగించి హత్య చేశారు.
హత్య అనంతరం ముగ్గురు కలిసి రాంరెడ్డి సెల్ ఫోన్ తీసుకోని పరారీ అయ్యారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. హతుడి మెడకు బిగించిన చున్నీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేయడంతో హత్యకు దారి తీసిన కోణం బయటపడింది. రాంరెడ్డి లైగింక వేధింపులు పోలీసులకు తెలపకుండా హత్య చేయడం నేరంగా భావించి.. యువతిని, ఆమె ప్రియుడు కళ్యాణ్, అతడి మిత్రుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.